ఆపరేషన్ సిందూర్ (Operation) సమయంలో కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు అంగీకరించిన కొద్ది రోజులకే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) కీలక వ్యాఖ్యలు చేశారు. నికార్సయిన సైనిక దళాలు ఎదురుదెబ్బలు లేదా నష్టాల వల్ల ప్రభావితం కావని ఆయన స్పష్టం చేశారు. యుద్ధంలో నష్టాల కంటే ఫలితాలే ముఖ్యమని నొక్కిచెప్పారు. సావిత్రిబాయి ఫులే పుణే విశ్వవిద్యాలయంలో ‘భవిష్యత్ యుద్ధాలు – యుద్ధరీతులు’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇస్తూ జనరల్ చౌహాన్ (Anil Chauhan) ఈ వ్యాఖ్యలు చేశారు. “వృత్తిపరమైన దళాలు ఎదురుదెబ్బలు లేదా నష్టాల వల్ల ప్రభావితం కావని నేను భావిస్తున్నాను. యుద్ధంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, మనోధైర్యం ఉన్నతంగా ఉండటం చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్టుగా మారగలగడం అనేది వృత్తిపరమైన సైనిక శక్తికి ముఖ్యమైన లక్షణం. ఏం తప్పు జరిగిందో అర్థం చేసుకోగలగాలి, తప్పును సరిదిద్దుకుని మళ్ళీ ప్రయత్నించాలి. భయంతో కూర్చోకూడదు” అని అన్నారు.

మే 7 ఘటనలో జరిగిన నష్టాలు
పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసే క్రమంలో, మే 7న జరిగిన ప్రతిఘటనలో భారత్ కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని జనరల్ చౌహాన్ (Anil Chauhan) ఇటీవల అంగీకరించిన విషయం తెలిసిందే. ఆ నష్టం తర్వాత భారత దళాలు తమ వ్యూహాలను మార్చుకుని, సరిహద్దుకు ఆవల ఉన్న పాక్ వైమానిక స్థావరాలకు భారీ నష్టాన్ని కలిగించాయని ఆయన వివరించారు. మే 7న, ఆరంభ దశలో నష్టాలు జరిగాయని నేను చెప్పగలను అని జనరల్ చౌహాన్ గతంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఘటన ఆధునిక ప్రపంచానికి ఆమోదయోగ్యం కాదని ఆయన తీవ్రంగా ఖండించారు. “పహల్గామ్‌లో జరిగింది బాధితుల పట్ల తీవ్రమైన క్రూరత్వం. ఎందుకంటే వారందరినీ వారి కుటుంబ సభ్యులు, పిల్లల ముందే తలపై కాల్చి చంపారు. మతం పేరుతో వారిని కాల్చిచంపడం ఈ ఆధునిక ప్రపంచానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పాశ్చాత్య దేశాలు ఒకటి లేదా రెండు ఉగ్రవాద చర్యలను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ భారత్ అత్యధిక ఉగ్రవాద దాడులకు గురైంది, దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, అది కొనసాగుతోందని సీడీఎస్ చౌహాన్ (Anil Chauhan) స్పష్టం చేశారు. “ఇది శత్రుత్వాల తాత్కాలిక విరమణ మాత్రమే. మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది,” అని ఆయన అన్నారు. పాకిస్థాన్ విషయానికొస్తే, నేను రెండు అంచనాలు వేయగలను. ఒకటి, వారు చాలా దూరం నుంచి వేగంగా ఆయుధాలను కోల్పోతున్నారు, ఇది మరికొంత కాలం కొనసాగితే, వారు మరింత నష్టపోయే అవకాశం ఉందని వారు భావించి ఉండవచ్చు, అందుకే వారు కాల్పుల విరమణకు ప్రతిపాదించి ఉంటారు” అని జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chauhan) విశ్లేషించారు. ఆయుధాల తక్కువతనం, మానవ నష్టం వల్ల వారు కాల్పుల విరమణను ప్రతిపాదించి ఉంటారు అన్న అంచనాలు. శత్రువు తాత్కాలికంగా తగ్గినంత మాత్రాన భద్రతాపరమైన తృప్తి చెందకూడదని హెచ్చరిక.
Read Also: India: 8 చోట్ల భారత్ దాడులు..పాక్ ప్రభుత్వం వెల్లడి