గూగుల్ మ్యాప్స్ అనే టెక్నాలజీ మన ప్రయాణాలను సులభతరం చేస్తోంది. మనకు తెలియని మార్గాల్లోనూ ఈ నావిగేషన్ టూల్ ఎంతో ఉపయోగపడుతోంది. కానీ అది చెప్పిన దారిని అనుసరించడం ప్రమాదకరమని ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా కేరళలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం ఈ విషయాన్ని మళ్లీ రుజువు చేసింది.

ప్రమాదానికి దారితీసిన గూగుల్ మ్యాప్
ఆదివారం(జూన్ 01) రోజున కేరళలోని(Kerala) కన్నూర్‌లో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్లిన ఓ కారు దారి తప్పి చెరువులోకి దూసుకుపోయింది. రూట్ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని ముందుకు వెళ్లారు. ఇంతలో మెయిన్ రోడ్డు నుంచి రూట్ మారింది. వేరే రూట్ చూపించడంతో షార్ట్ కట్ అనుకుని, కారును అటు తిప్పారు డ్రైవర్. కొంతదూరం వెళ్లగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకు పోయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.
గూగుల్ మ్యాప్ తప్పిదం – బాధితుల ఆరోపణలు
ప్రమాదం అనంతరం బాధితులు, “మేము గూగుల్ మ్యాప్(Google map) సూచించిన దారిలోనే ప్రయాణించాం. కానీ ఆ దారి మనుషుల కోసం కాదు. అది పూర్తిగా జలమయమైన ప్రదేశంగా మారిపోయింది. ఇది గూగుల్ మ్యాప్ పొరపాటు వల్లే జరిగింది” అని వాపోయారు. మునిగిపోతున్న కారును తాళ్లతో బంధించి, ఐదుగురిని ఒడ్డుకు తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ మ్యాప్ రాంగ్ రూట్ చూపించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు.
పోలీసుల దర్యాప్తు: టెక్నికల్ లోపమా? మానవ తప్పిదమా?
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, టెక్నికల్ లోపమా లేకా ప్రమాదానికి మరోదైనా కారణమా అన్న కోణంతో దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్ మ్యాప్ కొన్ని సార్లు తప్పుడు సమాచారం అందిస్తుందని ఇటీవల చాలా కంప్లైంట్లు వస్తు్న్నాయి. దీంతో గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించే సమయంలో కచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థానికులను అడ్రస్ అడుగుతూ మ్యాప్ చూస్తున్న మార్గాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలంటున్నారు. మ్యాప్స్ యాప్‌ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ వెర్షన్ ఉండేలా చూసుకుంటే ఏవైనా మార్పులు ఉంటే ముందే గమనించవచ్చని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌కు ఈ విషయంలో వేలాది ఫిర్యాదులు నమోదయ్యాయి.
Read also: Gang Rape : మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్