ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ షాపులు (Ration Shops) ఇవాళ నుంచి మళ్లీ తెరుచుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరఫరా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పిఠాపురం పట్టణంలోని 18వ వార్డులో రేషన్ దుకాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజల మధ్య రేషన్ సరుకులను స్వయంగా పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరళమైన విధానంతో సరుకులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.
రోజుకు రెండు పూటలా రేషన్ పంపిణి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ సరుకుల పంపిణీ ప్రతి నెలా 15వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. రోజు రెండు పూటలా — ఉదయం, సాయంత్రం — పంపిణీ జరగనుందని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ సౌకర్యం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల అవసరమైన వారికి సౌకర్యవంతంగా రేషన్ అందుతుందన్నారు.
రేషన్ షాప్ టైమింగ్స్
రేషన్ షాపులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఈ సమయాల్లో వచ్చి తమ సరుకులు తీసుకోవాలని సూచించారు. సరుకు పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Read Also : Gamblers Movie: గ్యాంబ్లర్స్ మూవీ ట్రైలర్ విడుదల