ప్రముఖ శృంగార నటి షకీలా (Shakeela) జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఇంద్రజీత్ లంకేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం, 2020 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై కలకాలం చర్చనీయాంశంగా నిలిచింది. రిచా చద్దా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి లభ్యమవుతోంది. ప్రస్తుతానికి హిందీ వర్షన్‌కి తోడు, తాజాగా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

సినిమా కథ – గ్లామర్ వెనుక బాధల మాయం
శృంగార తారగా నిలిచిన షకీలా బాల్యం నుంచి సినిమాల్లోకి వచ్చిన ప్రయాణం ఈ సినిమా కథాంశం. షకీలా బయోపిక్ తక్కువ వయసులోనే జీవిత పోరాటం ప్రారంభించిన ఆమె, సినీ పరిశ్రమలో ఎదురైన మోసాలు, లైంగిక చర్చలు, తారగా ఎదిగిన ప్రయాణంలోని చేదు సంఘటనలు అన్నీ సినిమా కీలక బిందువులు. సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ఈ సినిమాలో చూపించారు.
ఇంద్రజీత్ లంకేశ్ తెరెక్కించిన ఈ బయోపిక్ లో షకీలా పాత్రలో బాలీవుడ్ అందాల తార రిచా చద్దా నటించింది. 2020 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. హిందీతో పాటు తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ బయోపిక్ కు ఓ మోస్తరు వసూళ్లు చ్చాయి. అదే సమయంలో సినిమాలో ఎక్కువగా అడల్డ్ కంటెంట్ ఉండడంపై విమర్శలు వచ్చాయి. ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను బాగా ఆదరించారు. దీనికి తోడు ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. యూట్యూబ్‌లలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే థియేటర్లలో రిలీజైన ఐదేళ్ల తర్వాత షకీలా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో షకీలా సినిమా ఒరిజినల్ (హిందీ) వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
పాత్రలు, నటులు
ఈ బయోపిక్ లో పంకజ్ త్రిపాఠీ, టాలీవుడ్ నటి ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ ‘షకీలా’ సినిమాను నిర్మించారు. వీర్ సమర్థ్ సంగీతం అందించారుమహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన శివ్ రానా ఈ సినిమాలో సిల్క్ స్మిత రోల్ పోషించడం విశేషం. సినిమా విడుదల సమయంలో బోల్డ్ కంటెంట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు విమర్శకులు కథను ప్రభావవంతంగా చెప్పినప్పటికీ, కథనం ప్రధానంగా అడల్ట్ సీన్ల మీదనే కేంద్రీకృతమైందని అభిప్రాయపడ్డారు.
Read also: R Narayana Murthy: పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన నారాయణమూర్తి