తెలుగు చిత్రసీమలో విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన మంచు మనోజ్ (Manchu Manoj) నటించిన తాజా చిత్రం ‘భైరవం’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని పురస్కరించుకుని, హీరో మనోజ్ తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఈ పోస్ట్‌లో మనోజ్ తన తండ్రి మోహన్‌బాబు ‘పెదరాయుడు’ చిత్రంలో నటించిన లుక్‌ను పక్కన ఉంచి, తన లుక్‌ను అందంగా ఎడిట్ చేయించారు. దీనికి “ఆయన కొడుకు వచ్చాడని చెప్పు” అనే క్యాప్షన్ జోడించారు.

గత కొద్ది కాలంగా మోహన్‌బాబు (Mohan Babu)తో మనోజ్‌కు తలెత్తిన వ్యక్తిగత విభేదాలు, కుటుంబ కలహాలు పలు సందర్భాల్లో మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మనోజ్ భావోద్వేగానికి లోనై, “తండ్రి పాదాలను తాకాలనుంది” అని చెప్పిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది.
భైరవం సినిమాపై భారీ అంచనాలు
‘భైరవం’ (Bhairavam) సినిమాతో మంచు మనోజ్ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నాడు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటి వరకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూరమైన తర్వాత చేసిన మూవీ ఇది. దీంతో ఆయన అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవించి రూపొందించబడినట్లు సమాచారం. మనోజ్ అభిమానులు అతడి నటనను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన మునుపటి సినిమాల కన్నా పూర్తిగా భిన్నంగా కనిపించబోతున్నాడని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
Read also: Kannappa: ‘కన్నప్ప’ సినిమాపై మంచు విష్ణు కౌంట్‌డౌన్ పోస్ట్