ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరుగుతున్న కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహిస్తున్న బిజినెస్ సమ్మిట్లో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిపై వివరాలు చెబుతారు.
పెట్టుబడులకు ఆహ్వానం
సదస్సులో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల పెరుగుదల వంటి అంశాలను చంద్రబాబు హైలైట్ చేయనున్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉన్నదని వివరించి, వారి మద్దతు కోరనున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయాలని పిలుపునివ్వనున్నట్లు సమాచారం.
రేపు రాజమండ్రికి పయనం
సిఐఐ సదస్సు అనంతరం సీఎం చంద్రబాబు శనివారం ఉదయం నేరుగా రాజమండ్రికి బయలుదేరతారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గున్నేపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Also : Chiranjeevi : రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి