తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు కన్నడ రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన కన్నడ భాష, తమిళ భాష నుంచే జన్మించింది అని చేసిన కామెంట్ వివాదానికి దారితీసింది. దీంతో కన్నడ అనుకూల సంస్థలు తీవ్రంగా స్పందించాయి. కమల్ క్షమాపణ చెప్పకపోతే, ఆయన కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ విడుదలను నిరోధించాలని డిమాండ్ చేస్తున్నాయి.కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఫిల్మ్ చాంబర్ కూడా రంగంలోకి దిగింది. చాంబర్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ, కమల్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే థగ్ లైఫ్ సినిమాకు విడుదల అనుమతి ఉండదు అన్నారు.అంతేకాకుండా, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ వెంకటేష్ మాట్లాడుతూ, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. భాషతో పాటు వ్యాపారం కూడా మాకు ముఖ్యం అన్నారు. కమల్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

కమల్ హాసన్ ఏమన్నారు?
ఈ వివాదంపై కమల్ హాసన్ స్పందిస్తూ, ప్రేమతో మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పలేను అన్నారు. ఈ మాటలు మే 29న కేరళలో జరిగిన కార్యక్రమంలో వచ్చాయి. ఆయన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో మాత్రం కమల్‌కి మద్దతు, వ్యతిరేకత రెండూ వస్తున్నాయి.
శివరాజ్ కుమార్ మద్దతుగా నిలిచారు
ఈ వివాదంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) కమల్ హాసన్‌కి మద్దతుగా మాట్లాడారు. కన్నడ భాష కోసం నిజంగా ఏం చేశారని ప్రశ్నించారు, కామెంట్ చేయాలి. వివాదం వచ్చినప్పుడే స్పందించకుండా, ఎప్పుడూ భాషను ప్రోత్సహించాలి అని సూచించారు. ఆయన మాటలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
‘థగ్ లైఫ్’పై భారీ అంచనాలు
ఈ వివాదానికి మధ్య థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 5న రిలీజ్ కానున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో కమల్ హాసన్, త్రిషా, సింబు, అభిరామి తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కలిసి తీస్తున్న ఈ సినిమా ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తోంది.భాషా భావోద్వేగాలు ఎంత బలమైనవో ఈ వివాదం మరోసారి చూపించింది. కమల్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కావొచ్చు, కానీ ప్రజల భావోద్వేగాలు గౌరవించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇప్పుడు చూడాల్సిందల్లా – కమల్ హాసన్ క్షమాపణ చెబుతారా? లేక ‘థగ్ లైఫ్’ విడుదలపై బిగ్ ట్విస్ట్ ఉంటుందా?
Read Also : Manchu Manoj : మంచు మనోజ్‌కు సపోర్టుగా టాలీవుడ్ హీరో