పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలిసి రూపొందించనున్న ‘స్పిరిట్’ (‘Spirit’) సినిమా ఇప్పుడు చర్చలోకి వచ్చింది. కానీ ఈసారి వార్తలలో ప్రాజెక్ట్ కాదు, దానికి సంబంధించిన వివాదాలే హాట్ టాపిక్.బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి.తాను రోజుకు ఆరు గంటలే షూటింగ్ చేస్తానని, అదనపు రోజులకు అధిక పారితోషికం చెల్లించాలని డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది.సినిమా యూనిట్ ప్రకారం, ఈ డిమాండ్లు పెద్ద బడ్జెట్ సినిమాకి అవలంబించలేని షరతులుగా మారాయి.దీంతో ఆమె ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ కాంట్రవర్సీ వేడి తగ్గకముందే, నటి తమన్నా చేసిన ఓ లైక్ కొత్త చర్చకు దారితీసింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె లైక్ చేసిన ఒక రీల్‌లో దీపిక మాట్లాడిన ఓ క్లిప్ ఉంది.

ఆ వీడియోలో మహిళలపై లైంగిక వివక్ష, అధిక పనిగంటల ఒత్తిడి గురించి మాట్లాడారు.“ఆమె అగౌరవాన్ని సహించదు” అనే మెసేజ్‌తో ఉన్న ఆ రీల్‌కి లైక్ ఇచ్చిన తమన్నా, దీపికకు పరోక్షంగా మద్దతు ఇచ్చిందని పరిశీలకులు అంటున్నారు.ఈ కథనాల నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా మౌనంగా లేరన్నది స్పష్టమే.ప్రముఖ వెబ్‌సైట్ ‘పింక్‌విల్లా’లో వచ్చిన కథనంపై,“అది రాసిన వాడి నా పక్కనే కూర్చుని కథ విన్నట్టు ఉంది” అంటూ ఎక్స్ ఖాతాలో స్పందించారు.ఈ మాటలు ఆయన లీకైన కథ వివరాలపై వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలుగా అభివర్ణిస్తున్నారు.
ఇవి చదివిన కొందరు ఈ లీకుల వెనుక దీపికా ఉండొచ్చని భావిస్తున్నారు.త్రిప్తి దిమ్రి ఈ చిత్రంలో మరో లీడ్ హీరోయిన్‌గా నటిస్తుందనే ప్రచారం.ఆమె పాత్ర “హద్దులు దాటుతుంది” అన్న వార్తలపై కూడా సందీప్ వంగా అసహనం వ్యక్తం చేశారు.ఇలా స్క్రిప్ట్‌కి సంబంధించి బయటకి వచ్చిన ఊహాగానాలు దర్శకుడికి ఎప్పుడూ ఇష్టమవు.‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌పై ఉన్న ఆసక్తి, ఇప్పుడు వివాదాల దుమారంతో ఇంకా ఎక్కువగా మారింది.దీపిక వైదొలగడం, తమన్నా స్పందన, వంగా కామెంట్లు – ఇవన్నీ సినిమాకు పబ్లిసిటీ తీసుకువస్తున్నా, అసలు కథేంటన్నదానిపై స్పష్టత మాత్రం ఇంకా లేదు.
Read Also : Kamal Haasan : క్షమాపణ చెప్పకుంటే కమల్ సినిమాలు నిషేధించాలి : కర్ణాటక మంత్రి