తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉద్యోగులకు (Employees ) శుభవార్త చెప్పేందుకు ముస్తాబవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెండింగ్‌లో ఉన్న రెండు డీఏ (DA)లను చెల్లించేందుకు ప్రభుత్వ ఉన్నత స్థాయి కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయానికి దారితీసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు, ఉద్యోగుల సంక్షేమం కోసం మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్ చెల్లింపునకు సూచన
పెండింగ్‌లో ఉన్న డీఏలతో పాటు, ఉద్యోగులు రిటైర్ అయ్యే రోజునే పింఛన్, గ్రాట్యుటీ, ఇతర సదుపాయాల్లో కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటి వరకు లేట్‌గా వచ్చే ఈ బెనిఫిట్స్ ఇకపై నిర్దిష్ట సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని ఆఖరి దశ చర్చలు జరుగుతున్నాయి.
క్యాబినెట్ సబ్ కమిటీలో తుది నిర్ణయానికి అవకాశం
ఈ అంశాలపై రేపు జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగుల డీఏ చెల్లింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డీఏల చెల్లింపుతో వారికి ఆర్థిక భారం కొంత తరిగే అవకాశం ఉంది.
Read Also : PCC : పీసీసీ కార్యవర్గం కూర్పుపై శ్రేణుల్లో ఉత్కంఠ