తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) కు ఫార్ములా-ఈ రేస్ కేసు(E formula case)లో ACB నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆయనకు సూచించినట్టు కేటీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని ACB పేర్కొన్నట్లు సమాచారం.
విదేశీ పర్యటన కారణంగా హాజరు వాయిదా
ఇప్పటికే తనకు యూకే, యుఎస్‌ఎ పర్యటనల షెడ్యూల్ ఖరారైందని, అందువల్ల తాను ఈ నెల 28న హాజరుకాలేనని కేటీఆర్ తెలిపారు. విదేశీ పర్యటనల నుంచి తిరిగిన తర్వాత విచారణకు హాజరయ్యే సిద్ధత తనకు ఉందని వెల్లడించారు. ACBకు ఈ విషయం తెలియజేశామని తెలిపారు. విచారణ ప్రక్రియలో సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
రాజకీయ కక్షపై కేటీఆర్ విమర్శలు
ఈ నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారని విమర్శించారు. అంతేకాక, నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీటులో తన పేరు చేర్చిన 48 గంటలు గడిచినా ఒక్క బీజేపీ నేత కూడా దీనిపై స్పందించకపోవడం విడ్డూరమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజకీయ పతనాన్ని కప్పిపుచ్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : China :2030 నాటికి చైనా వద్ద 1000 అణ్వాయుధాలు!