2025 ఐపీఎల్ (IPL ) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో అద్భుత విజయం సాధించడంతో పాటు, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అధిగమించాడు. మే 25న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆయన తన ఐపీఎల్ కెరీర్‌లో 100వ సిక్సర్‌ను బాది ఈ ఘనతను సాధించాడు.

అభిషేక్ శర్మ ఘనత
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో గౌరవనీయమైన మైలురాయిని చేరుకున్నారు. మే 25న అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆయన ఐపీఎల్‌లో తన 100వ సిక్సర్‌ను బాది, లీగ్ చరిత్రలో ఈ ఘనతను సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH జట్టు, ట్రావిస్ హెడ్ తో కలిసి అభిషేక్ శర్మ 92 పరుగుల అద్భుతమైన తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో, జట్టు మంచి ఆరంభాన్ని పొందింది. అభిషేక్ 16 బంతుల్లో 32 పరుగులు చేయగా, ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ సిక్సర్లలు రెండు సునీల్ నరైన్ బౌలింగ్‌పై వచ్చింది, ఇవి అతనికి వ్యక్తిగతంగా 100వ సిక్సర్లగా నిలిచాయి.
కోహ్లీ, రోహిత్ ల అరుదైన లిస్టులో అభిషేక్
ఐపీఎల్‌లో 75వ ఇన్నింగ్స్‌కే ఈ మైలురాయిని అధిగమించిన అభిషేక్, ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో 41వ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజులు ఉన్నారు. అంతేకాకుండా, అభిషేక్ ఆ జాబితాలో చోటు సంపాదించడం యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు క్రిస్ గేల్ కాగా, అతని పేరిట మొత్తం 357 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ 297 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు, త్వరలోనే 300 సిక్సర్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. ఇలాంటి ఘనతలు అభిషేక్ శర్మ క్రికెట్‌లో చేస్తున్న అభివృద్ధిని సూచిస్తాయి. వయసులో చిన్నవాడైనప్పటికీ, అతని ఆటతీరులో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, దూకుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఓపెనర్‌గా నిలదొక్కుకున్న అభిషేక్, వరుసగా చక్కటి ప్రదర్శనలతో జట్టును విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
క్లాసెన్ సెంచరీ – SRH రికార్డులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ 2025 సీజన్‌ను హై తో ముగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆదివారం ఢిల్లీలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో, హెన్రిచ్ క్లాసెన్ విజృంభించడంతో SRH 110 పరుగుల భారీ తేడాతో గెలిచింది. క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించి, తన సునాయాసమైన శైలిలో 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా అద్భుతంగా ఆడి 40 బంతుల్లో 76 పరుగులు చేసి ‘ఆరెంజ్ ఆర్మీ’కి శక్తివంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ కట్టుబాటు లేకుండా పోయింది
ఈ జోడి ప్రదర్శనతో SRH 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇది మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై SRH చేసిన 286 పరుగుల తర్వాత రెండో అత్యధిక స్కోరుగా నిలిచింది. హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం, ట్రావిస్ హెడ్ స్థిరత SRH గెలుపుకు మూలస్థంభాలుగా నిలిచాయి.