తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TG ECET) 2025 ఫలితాలను మే 25 (ఆదివారం) మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేశారు. ఈ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్ణ అధికారికంగా ప్రకటించారు.

పరీక్ష వివరాలు:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు మే12న నేడు ఈసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తాజాగా విడుదలైన ఈసెట్ ఫలితాల్లో మొత్తం 93.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలక్రిష్ణ తెలిపారు.
ఫలితాల కోసం లింక్ :
ఈసారి కూడా అన్ని విభాగాల్లో అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యార్ధులు తమ వివరాలు నమోదు చేసి ఈ https://ecet.tgche.ac.in/ డైరెక్ట్ లింక్ ద్వారా ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అత్యధిక మార్కులు సాధించిన వారు
మెకానికల్ ఇంజినీరింగ్‌లో పోతుగంటి కార్తిక్, సివిల్ ఇంజినీరింగ్‌లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో శ్రీకాంత్, ఫార్మసీలో ఐలి చందన, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కట్లే రేవతి, బీఎస్సీ మ్యాథ్స్‌లో సంతోష్ కుమార్, మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో తోట సుబ్రహ్మణ్యం, కెమికల్ ఇంజినీరింగ్‌లో లెంక తేజ సాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో కాసుల శ్రావణి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో రాపర్తి చందన, మైనింగ్ ఇంజినీరింగ్‌లో కుర్మ అక్షయ మొదటి ర్యాంకు సాధించారు.
Read also: UPSC: నేడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష