దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగ పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఈరోజు (మే 25, ఆదివారం) జరగనుంది. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వేలాది పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోంది.

పరీక్షా షెడ్యూల్:
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఈ రోజు ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి అభ్యర్థి పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9:00 తర్వాత, మధ్యాహ్నం 2:00 తర్వాత ఎవరికీ ప్రవేశం ఉండదు. ఉదయం పరీక్షకు 8:00 గంటల నుండి, మధ్యాహ్నం పరీక్షకు 1:00 గంటల నుండి ప్రవేశం ఇవ్వబడుతుంది. అంటే ఉదయం 9 గంటల తర్వాత, మధ్యాహ్నం 2 తర్వాత అభ్యర్థులను ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
అభ్యర్థులకు సూచనలు:
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, పెన్ను, పెన్సిల్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తీసుకెళ్లవల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. చేతి గడియారాలు, సెల్ఫోన్లు బయటే వదలివెళ్లాలి. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటనలో సూచించారు.
భద్రతా ఏర్పాట్లు & 163 సెక్షన్ అమలు:
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పటిష్ట పోలీసుల బందోబస్తు కూడా ఉంటుంది. అన్ని యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలు, ఊరేగింపులకు అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాలకు చుట్టుపక్కల ఉన్న అన్ని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు మూసివేతలో ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా IAS, IPS, IFS, IRS వంటి ప్రముఖ సేవల్లోకి ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షను అధిగమించిన అభ్యర్థులే మెయిన్స్‌కు అర్హులు అవుతారు.
Read also: Rajiv Yuva Vikasam: రాజీవ్ యువవికాసం..నెలాఖరులో ఎంపిక