టాలీవుడ్ యాక్షన్ హీరో మంచు మనోజ్ ఇవాళ మే 20న తన పుట్టినరోజు (Manchu Manoj celebrates his birthday today, May 20th) జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ రాకింగ్ స్టార్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అలాగే, మనోజ్ భార్య మౌనికా రెడ్డి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఆమె తన భర్త, పిల్లలతో ఉన్న అందమైన ఫొటోను పోస్ట్ చేస్తూ, మనోజ్ పై తన ప్రేమను గుండెల్లోని మాటల్లా మిళితం చేసింది.”నువ్వు మా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి మేము మారిపోయాం,” అంటూ మౌనికా తన భావోద్వేగాన్ని ఇలా పంచుకుంది –”నా జీవితాన్ని వెలిగించిన నా సోల్‌మేట్‌కు హ్యాపీ బర్త్ డే( Happy birthday to my soulmate who lights up my life).నీవు మమ్మల్ని చూసుకునే విధానం నిజంగా మాతో ముడిపడిపోయింది.

నీ ప్రేమను, నీ నవ్వును మేము ఎప్పటికీ మర్చిపోలేం.”మౌనిక తన పోస్ట్‌లో, “ఈ సంవత్సరం మాత్రమే కాదు, ప్రతీ సంవత్సరం నువ్వే మా రాకింగ్ స్టార్. నీ హృదయం వెయ్యేళ్లూ ప్రేమను పంచాలని కోరుకుంటున్నా. ప్రతి పునర్జన్మలో నిన్నే నా జీవిత భాగస్వామిగా కోరుకుంటాను,” అంటూ భావోద్వేగంగా రాసింది.ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతూ, వేల మంది నెటిజన్ల నుంచి స్పందనలు వచ్చాయి. అభిమానులు కూడా కామెంట్స్ ద్వారా మనోజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్యామిలీ ఫొటోలకు లైక్స్ పౌరాలు కురుస్తున్నాయి.పూర్తి ఆరు సంవత్సరాల తర్వాత, మనోజ్ “భైరవం” అనే సినిమాతో తిరిగి వస్తున్నాడు. ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తుండగా, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇది ఓ మల్టీస్టారర్ యాక్షన్ డ్రామా మూవీ. ఇప్పటికే షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 30న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.ఈ సినిమాలో శంకర్ కుమార్తె అదితీ శంకర్ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అవుతోంది. అలాగే ఆనంది, దివ్య పిళ్లై కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.కె. రాధా మోహన్ నిర్మిస్తున్నారు.భైరవం ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మనోజ్ రీ ఎంట్రీ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అభిమానులు “ఇది (Manchu Manoj) కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?” అంటూ ఎదురుచూస్తున్నారు.ఇంతకీ, ఈ పుట్టినరోజు మనోజ్‌కు ఎమోషనల్ మోమెంట్స్‌తో పాటు, కెరీర్ పరంగా ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చింది. భార్య ప్రేమతో, అభిమానుల ఆశీస్సులతో, ‘భైరవం’ సినిమా విజయవంతమవుతుందా? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Read Also : Andhra : అడవిలో ఓ పెద్ద బండరాయిపై వింత రాతలు..వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలు