हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన “త్రీ బ్రదర్స్” కూటమి

Shobha Rani
Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన “త్రీ బ్రదర్స్” కూటమి

భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ (Pakistan Azerbaijan Turkey) కలిసి ఏర్పరచుకున్న అనధికారిక సైనిక-రాజకీయ కూటమి ఇది. మూడు దేశాలు ఇస్లామిక్ బ్యాక్‌గ్రౌండ్, సైనిక సహకారం, కాశ్మీర్‌పై ఉమ్మడి వైఖరి వంటి అంశాల్లో ఏకతాటిపై ఉన్నాయి. భారతదేశం ఒక కొత్త ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సరికొత్త ముప్పు బహిర్గతమైంది. ఆ ముప్పు పేరే “త్రీ బ్రదర్స్ అలయన్స్”. దేశ విభజన సమయం నుంచి శత్రు వైఖరితో ఉన్న పాకిస్తాన్ అందులో ఒకటి. పాక్ వైఖరి తెలుసు కాబట్టి ఆ దేశం నుంచి ఎదురయ్యే ముప్పు గురించి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఇప్పుడు త్రీ బ్రదర్స్ కూటమిలో పాకిస్తాన్‌కు అండదండలు అందిస్తున్న సోదర దేశాలు టర్కీ, అజర్‌బైజాన్‌తో కొత్త ముప్పు ముంచుకొచ్చింది. అందులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి NATOలో సభ్యదేశంగా ఉన్న టర్కీ వైఖరే యావద్దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రజలు స్వచ్ఛందంగా ఆ దేశంతో సంబంధాలు తెంచుకుంటుండగా.. భారత ప్రభుత్వం ఆచితూచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్‌(Pakistan Azerbaijan Turkey) లు కలిసి భారతదేశాన్ని సవాలు చేయడానికి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి గత నాలుగేళ్లుగా రాజకీయ, ఆర్థిక మరియు సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తోంది.
త్రీ బ్రదర్స్ అలయన్స్ ప్రభావం – విశ్లేషణ
2021లో అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ (Pakistan Azerbaijan Turkey) అధినేతలు కలిసి తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే “త్రీ బ్రదర్స్ అలయన్స్” పేరుతో ఒక అనధికారిక కూటమి ఏర్పడింది. ఈ మూడు దేశాల మధ్య చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు టర్కిక్ (తురుష్కులు) వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇక ఈ మూడు దేశాలను కలిపే కీలకమైన అంశం మతం. ఈ మూడూ మెజారిటీ ఇస్లామిక్ దేశాలు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ ఈ కూటమి వెనుక ప్రధాన శక్తిగా ఉన్నారు. టర్కీ ప్రభావాన్ని విస్తరించడానికి, ఎర్డోగాన్ తన దేశంతో సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాలతో సహకారాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కూటమి మూడు దేశాలకు పరస్పర ప్రయోజనాలను అందించింది. ఉదాహరణకు, 2020 నాగోర్నో-కరబాఖ్ సంఘర్షణలో అజర్‌బైజాన్‌ దేశానికి టర్కీ సైనిక మద్దతు అందించింది. ఫలితంగా ఆర్మేనియాపై అజర్‌బైజాన్ విజయం సాధించడంలో సహాయపడింది. అదేవిధంగా, 1950ల నుండి పాకిస్తాన్ టర్కీతో సన్నిహిత రక్షణ సంబంధాలను కలిగి ఉంది. దీని ద్వారా క్రూయిజ్ మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ముఖ్యమైన సైనిక సాంకేతికతను పొందింది.

Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన "త్రీ బ్రదర్స్" కూటమి
Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన “త్రీ బ్రదర్స్” కూటమి

2021 బాకూ సమావేశం – అలయన్స్ జననం
2021లో ఈ మూడు దేశాలు “త్రీ బ్రదర్స్” సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి. సైనిక సమన్వయాన్ని మెరుగుపరచుకున్నాయి. ఈ కూటమి దేశాలు ఒకరి ప్రాదేశిక వివాదాలలో మరొకరికి మద్దతు ఇస్తాయి. అంటే.. కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ విధానానికి టర్కీ, అజర్‌బైజాన్ మద్దతు ఇస్తాయని దానర్థం. టర్కీ ఐక్య రాజ్య సమితి (UN) వంటి వేదికలపై కాశ్మీర్ సమస్యను పదేపదే లేవనెత్తింది. ఇది భారతదేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది. పహల్‌గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అజర్‌బైజాన్, టర్కీ రాజకీయంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాయి. భారతదేశంపై దాడుల్లో టర్కీ అందజేసిన డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించింది. ఇది ఈ కూటమి యొక్క సైనిక సహకార తీవ్రతను సూచిస్తుంది.
ఈ కూటమి ఎందుకు ఆందోళన కలిగిస్తుంది? ఒబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF)కు చెందిన కబీర్ తనేజా మాట్లాడుతూ “ఈ కూటమి చాలా కాలంగా ఉంది. ఇది భారతదేశానికి భౌగోళిక రాజకీయ సమస్యగా మారింది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఇది భారతదేశానికి పెద్ద సమస్య అని నేను అనుకోను” అని అన్నారు. అయితే టర్కీ, అజర్‌బైజాన్ రెండూ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం లేదని ఆయన సూచించారు. అయినప్పటికీ భారతదేశం ఈ కూటమికి రాజకీయంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని తనేజా వాదించారు.
భారతదేశ వ్యూహాత్మక ప్రతిస్పందన
ఈ కూటమి విసిరే సవాలును ఎదుర్కోవడానికి భారతదేశం ఇరాన్, ఆర్మేనియాతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. ఆర్మేనియా, అజర్‌బైజాన్‌తో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు కలిగి ఉంది. ఇరాన్ కూడా అజర్‌బైజాన్‌తో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇరాన్‌లో నివసిస్తున్న లక్షలాది అజారీలు అజర్‌బైజాన్‌తో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ దేశం ఈ సంబంధాలను ఉపయోగించి విభజన ఉద్యమాలను ప్రోత్సహించవచ్చని ఇరాన్ భయపడుతోంది. భారతదేశం ఆర్మేనియాకు వెపన్ లొకేటింగ్ రాడార్లు, ఆర్టిలరీ సిస్టమ్స్, రాకెట్ లాంచర్లను విక్రయించింది. దీని ద్వారా ఆర్మేనియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసింది. గత సంవత్సరం ఆస్ట్రా మిస్సైల్స్ కొనుగోలు ఆర్మేనియా Su30 ఫైటర్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి చర్చలు జరిగాయి. ఈ చర్యలు అజర్‌బైజాన్‌ను కలవరపరిచాయి. భారతదేశం ఇప్పటి వరకు సూక్ష్మ దౌత్యం, వ్యూహాత్మక కూటముల ద్వారా “త్రీ బ్రదర్స్” కూటమి పెరుగుదలపై నియంత్రణ చూపిస్తోంది. ఇది పూర్తిగా శత్రుత్వ కూటమిగా మారకముందే సంబంధిత దేశాలతో బాలెన్స్‌డ్ రాజకీయ వైఖరి కొనసాగించాల్సిన అవసరం ఉంది.
Read Also: Nitasha Kaul: యాంటీ-ఇండియా ఆరోపణలపై బ్రిటిష్ ప్రొఫెసర్‌కి OCI రద్దు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ

రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

తెలంగాణలో ట్రంప్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

తెలంగాణలో ట్రంప్ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

జపాన్ స్టాక్ మార్కెట్ టెక్ షేర్ల ఒత్తిడితో స్వల్ప నష్టం…

జపాన్ స్టాక్ మార్కెట్ టెక్ షేర్ల ఒత్తిడితో స్వల్ప నష్టం…

శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ‌ సుముఖంగా లేరు: ట్రంప్

శాంతి ప్రతిపాదనపై జెలెన్‌స్కీ‌ సుముఖంగా లేరు: ట్రంప్

థాయ్–కాంబోడియా సరిహద్దులో మళ్లీ ఘర్షణలు…

థాయ్–కాంబోడియా సరిహద్దులో మళ్లీ ఘర్షణలు…

ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

వీసా వ్యాఖ్యలతో వివాదంలో జేడీ వాన్స్‌…

వీసా వ్యాఖ్యలతో వివాదంలో జేడీ వాన్స్‌…

📢 For Advertisement Booking: 98481 12870