తెలంగాణలో రైలు ప్రయాణికులకు మరింత అధునాతన సేవలు అందించడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వరంగల్ రైల్వే స్టేషన్ ను రూ.25.41 కోట్ల వ్యయంతో నూతనంగా అభివృద్ధి చేసిన కేంద్ర రైల్వే శాఖ, మే 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కొత్త భవనాన్ని వర్చువల్‌గా ప్రారంభించనుంది. ఈ సందర్భంగా వరంగల్ కు చెందిన బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా స్టేషన్లను ఆధునీకరించాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ నిధులను కేటాయిస్తుందని, ఇందులో వరంగల్ ప్రాజెక్ట్ ఒక భాగమని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందని అన్నారు.”

అత్యాధునిక భవన మౌలిక సదుపాయాలు
కొత్తగా నిర్మించిన వరంగల్ రైల్వే స్టేషన్ భవనంలో అనేక సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యంగా విశాలమైన ఫుట్ ఓవర్‌బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ర్యాంప్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, ఆధునిక ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయన్నారు. కాగా, వరంగల్ స్టేషన్లో నాలుగు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. రోజుకు 137 రైళ్లు రాకపోకలు కొనసాగుతాయి. ఇది ప్రతిరోజూ సగటున 31,887 మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. ప్రదీప్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ స్టేషన్ నూతనంగా అభివృద్ధి చేయడంలో ప్రయాణికుల అవసరాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. ముఖ్యంగా, ఎసి వెయిటింగ్ హాల్స్, అల్ట్రా మోడర్న్ లాంజ్‌లు, క్లీనెస్స్పై దృష్టి సారించిన రెస్ట్‌రూమ్స్, సురక్షితంగా ఉపయోగించుకోగల స్టోరేజ్ రూమ్స్, 24/7 నిఘా కెమెరాలతో కూడిన ఎటిఎం సౌకర్యం, శుద్ధి చేసిన తాగునీటి పాయింట్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగా వరంగల్ స్టేషన్‌కు ఆధునీకరణ నిధులు మంజూరు చేయడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభించే యోచనలో కూడా కేంద్రం ఉన్నట్లు సమాచారం.
Read also: Telangana : నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు