జమ్మూ కశ్మీర్‌లోని తంగ్‌ధర్ సెక్టార్‌లో శనివారం ప్రత్యేక దృశ్యం కనిపించింది.భారత సాయుధ బలగాలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.భారత్ యుద్ధం కోరదు.శాంతియుతంగా జీవించాలనుకుంటుంది, అని JK LG Manoj Sinha : భారత సైన్యం దాటి వెళ్లలేని ప్రదేశం పాకిస్థాన్‌లో లేదు : మనోజ్ సిన్హా చెప్పారు. కానీ, శాంతిని బలహీనతగా పరిగణించే వారికి గుణపాఠం చెప్పే శక్తి మన బలగాల్లో ఉందన్నారు.భారత ఆర్మీ పాకిస్థాన్‌లో ఏ ప్రదేశానికైనా చేరగలదు, అని స్పష్టంగా చెప్పారు.మన సైన్యం ధైర్యం ప్రపంచం చూసింది. వాళ్ల సాహసం మాటల్లో చెప్పలేము,” అని ప్రశంసించారు.భారత్‌తో శాంతి కోరుతూ పాక్ ప్రపంచ దేశాలకు వేడుకుంటోంది,” అని తెలిపారు.

అదే సమయంలో మన దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోంది.ఇప్పటికే భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక త్వరలో నాల్గవ స్థానంలోకి వెళ్తుంది, అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా, యువత కలలతో ముందుకెళ్తోంది అని ఆయన వివరించారు.”పాక్ చేసిన దాడులకు మన బలగాలు గట్టి సమాధానం ఇచ్చాయి. అయినా సరే, పాకిస్తాన్ ఇంకా మారకపోతే అది వారి నష్టం,” అని హెచ్చరించారు.”మన బలగాల అంకితభావం, శక్తిని చూసి నాకు గర్వంగా ఉంది. వారిని శాల్యూట్ చేస్తున్నాను,” అని సిన్హా గర్వంగా అన్నారు.”ఏ సంక్షోభం వచ్చినా, భారత సైన్యం దేశాన్ని కాపాడగలదు,” అని మనోజ్ సిన్హా ధీమాగా చెప్పారు. ప్రజలు సైన్యం పట్ల నమ్మకంతో ఉండాలన్నారు.”శాంతి మన లక్ష్యం. కానీ ఆ శాంతికి ఆటంకం కలిగిస్తే ఊరుకోము,” అని అన్నారు.
Read Also : Amit Shah : పాక్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు…