ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో మరియు స్విగ్గీ (Zomato & Swiggy)తాజాగా తమ ప్రీమియం సేవలలో కీలక మార్పులు చేపట్టాయి. ఇప్పటి వరకు జొమాటో గోల్డ్ మరియు స్విగ్గీ వన్ సభ్యులకు ప్రత్యేక సేవల రూపంలో అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉండేది. కానీ నూతన విధానంతో ఇకపై వర్షపు పరిస్థితుల్లో ప్రీమియం యూజర్లు కూడా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
వర్షంలో ఆర్డర్ చేసేవారికి చార్జీలు
ఈ మార్పులు నిన్నటి (మే 16) నుంచే అమల్లోకి వచ్చాయి. అందుకనుగుణంగా, వర్షపు వాతావరణంలో ఫుడ్ ఆర్డర్ చేస్తే సాధారణ యూజర్ల్లాగే ప్రీమియం యూజర్లకు కూడా రూ.15 నుండి రూ.30 వరకూ సర్‌ఛార్జీ వసూలు చేస్తారు. ఇది వాతావరణ పరిస్థితులు, డెలివరీ స్థలాన్ని బట్టి మారవచ్చు. రోడ్డుపై ట్రాఫిక్, వరదల కారణంగా డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల వల్ల ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు కంపెనీలు వెల్లడించాయి.
యూజర్లు ఈ నిర్ణయంపై అసంతృప్తి
ప్రీమియం సభ్యత్వాలను తీసుకున్న యూజర్లు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కంపెనీలు మాత్రం భద్రతా పరంగా ఈ మార్పులు అవసరమని, వర్షపు రోజుల్లో డెలివరీ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాయి. ఈ నిర్ణయం ఫుడ్ డెలివరీ మార్కెట్లో వినియోగదారులపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.
Read Also : http://Operation Sindoor : విదేశాలకు ఎంపీల బృందాలు!