ఈ మానవతా రహిత ఘటన హైదరాబాద్ నగరంలో గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ తండ్రే తన 14 రోజుల పసికందును అత్యంత పాశవికంగా హత్య చేసి చెత్తకుప్పలో పడేసిన వార్త ప్రజల్లో తీవ్ర ఆవేదన కలిగించింది. పుట్టిన బిడ్డను ప్రేమతో చూసుకోవాల్సిన తండ్రి, ఆ పసికందును అత్యంత కిరాతకంగా చంపాడు.

హత్య ఉదంతం:
నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 14 రోజుల క్రితమే అతడికి అమ్మాయి పుట్టింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జగత్ తన కుమార్తెను అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని టోలీచౌకిలోని చెత్తకుప్ప సమీపంలో పడేసినట్టు గోల్కొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. భర్త గత కొద్ది రోజుల నుంచి సైకోలా ప్రవర్తిస్తాడని భార్య పోలీసులకు చెప్పింది.
పోలీసుల స్పందన:
ఈ దారుణాన్ని గమనించిన అతడి భార్య వెంటనే గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. జగత్‌ను అదుపులోకి తీసుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే, ఇంతటి ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలను నిందితుడు ఇంకా వెల్లడించలేదని పోలీసులు పేర్కొన్నారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read also: Visakhapatnam: చేయి విరిగిందని ఆస్పత్రికొస్తే ప్రాణాలనే మింగేసిన నకిలీ వైద్యుడు
Telangana Cabinet Meeting : ఈనెల 19న తెలంగాణ క్యాబినెట్ భేటీ?