తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) కాళేశ్వర పుష్కరాలను(kaleshwaram pushkaralu) సందర్శించిన అనంతరం ఈ పవిత్ర క్షేత్రాన్ని అత్యుత్తమ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది త్రివేణి సంగమంలో పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా సీఎం పర్యటించారు.
కాళేశ్వరాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దుతాం
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, “గోదావరి, కృష్ణా, సరస్వతీ పుష్కరాలను నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. ఈ పుష్కరాలన్నింటినీ ఘనంగా నిర్వహించేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం. కాళేశ్వరాన్ని పుణ్యభూమిగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.
సమాచారం కేంద్రాలు ఏర్పాటు
దేశం నలుమూలల నుండి భక్తులు, పర్యాటకులు తరలివచ్చేలా మౌలిక వసతులు, రహదారులు, వసతి గృహాలు, సమాచారం కేంద్రాలు ఏర్పాటుచేస్తామని సీఎం స్పష్టం చేశారు. పుష్కరాల సమయంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, భవిష్యత్‌లో మరింత విస్తృత ప్రణాళికలతో కాళేశ్వర అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు.
Read Also : Trinamool Congress : తృణమూల్లో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి