సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం
భారత సుప్రీం కోర్ట్ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గావై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించారు. బి.ఆర్. గవాయి ఈ అత్యున్నత పదవిని అధిరోహించారు.ప్రమాణ స్వీకార వేడుక వివరాలు
రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు, ఇతర అతిథులు హాజరయ్యారు.
జననం మరియు పుట్టిన ప్రదేశం.
జస్టిస్ గవాయి మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించారు.
న్యాయవాదిగా వృత్తి ప్రారంభం
ఆయన తన న్యాయ వృత్తిని 1985 మార్చ్ 16న ప్రారంభించారు.
బాంబై హైకోర్టులో అదనపు న్యాయమూర్తి
2003 నవంబర్ 14న ఆయన బాంబై హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియామితులయ్యారు.
శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి
ఆ తర్వాత, 2005 నవంబర్ 12న బాంబై హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, పలు ధర్మాసనాలలో సేవలందించారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రస్థానం
2019 మే 24న ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.ధర్మాసనాలలో విస్తృత అనుభవం సుప్రీం కోర్టులో గత ఆరేళ్లలో జస్టిస్ గవాయి సుమారు 700 ధర్మాసనాలలో భాగస్వాములయ్యారు. ఇది ఆయనకున్న విస్తృత అనుభవాన్ని తెలియజేస్తుంది.
సిజేఐ పదవికి సిఫారసు
ఆయన పేరును మాజీ సిజే సంజీవ్ కన్నా ఏప్రిల్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా బి.ఆర్. గవాయి నియామకానికి ఇది మార్గం సుగమం చేసింది.
ప్రధాన న్యాయమూర్తిగా పదవీకాలం
గవాయి గారు సిజేఐ గా సుమారు ఆరు నెలల పాటు కొనసాగనున్నారు. ఆయన నవంబర్ 23న పదవి విరమణ చేయనున్నారు.
రెండో దళిత ప్రధాన న్యాయమూర్తి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ గవాయి చరిత్ర సృష్టించారు.
మొదటి దళిత సిజేఐ
అంతకుముందు జస్టిస్ కేజి బాలకృష్ణన్ భారత అత్యున్నత న్యాయస్థానానికి మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఖ్యాతి గడించారు.