భారత సైన్యం చేపట్టిన కీలక వ్యూహాత్మక దౌత్య చర్య ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)కు సంబంధించి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశీయంగా ఆయుధ, రక్షణ సామగ్రి తయారీలో ముందంజలో ఉన్న ఈ నగరం, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ అవసరాల కోసం వివిధ కంపెనీల నుంచి పెద్దఎత్తున సరఫరాలు అందిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు అయిన DRDO, BDL, BELలతో పాటు, ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమవుతున్నాయి.
రక్షణ పరిశ్రమకు ఉన్న బలమైన మౌలిక వసతులు
ప్రైవేట్ రంగ సంస్థలైన అదానీ ఎల్బిట్ అడ్వాన్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఇప్పటికే ఆర్మీకి ఆయుధాలు, మిస్సైల్స్‌కు అవసరమైన విడిభాగాలు, డ్రోన్లకు అవసరమైన కీలక సాంకేతిక పరికరాలను సరఫరా చేస్తున్నాయి. హైదరాబాద్లో (Hyderabad) రక్షణ పరిశ్రమకు ఉన్న బలమైన మౌలిక వసతులు, సాంకేతిక నిపుణులు ఈ అవకాశాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడుతున్నాయి.
హైదరాబాద్ రక్షణ రంగ అభివృద్ధిలో ముఖ్య కేంద్రం
ఈ ఆపరేషన్‌తో హైదరాబాద్‌కు చెందిన రక్షణ రంగ పరిశ్రమలకు భారీ స్థాయిలో ఆర్డర్లు వస్తుండటంతో, ఈ నగరం మరోసారి దేశ రక్షణ వ్యూహాల్లో కీలక హబ్‌గా నిలుస్తోంది. దేశంలో స్వదేశీ తయారీకి ప్రోత్సాహం అందిస్తూ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఇది మద్దతు ఇస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు ఈ రంగంలో ప్రవేశించే అవకాశం ఉండగా, హైదరాబాద్ రక్షణ రంగ అభివృద్ధిలో ముఖ్య కేంద్రంగా కొనసాగనుంది.
Read Also : War : చైనా, పాకిస్థాన్.. మీ బుద్ధులు మారవా?