భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. కానీ ఈ టూర్‌కు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి వైదొలగటం జట్టు కోసం పెద్ద షాక్‌గా మారింది. ఈ ఇద్దరి గైర్హాజరీతో, ప్రత్యేకంగా నాలుగో స్థానంలో ఎవరు బరిలోకి దిగాలన్న చర్చ వేగం పుట్టించింది.ఇప్పటి వరకు నాలుగో స్థానంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ Anil Kumble తన అభిప్రాయం తెలియజేశాడు. దేశవాళీ క్రికెట్‌లో కరుణ్ నాయర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అతను గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ అనుభవం కూడా అతనికి ఉంది. అక్కడి పిచ్‌లు, వాతావరణం గురించి మంచి అవగాహన ఉంది. నాలుగో స్థానానికి అతడే సరైన ఎంపిక అని కుంబ్లే చెప్పాడు. కరుణ్ వయసు 33 ఏళ్లు దాటినా, ఇంకా ఫిట్‌గా ఉన్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. “అతని లాంటి ఆటగాళ్లకు జట్టులో చోటిస్తే, దేశవాళీ క్రికెట్‌కు ప్రోత్సాహం లభిస్తుంది” అని కుంబ్లే విశ్లేషించారు. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన వారికి గుర్తింపు రావాలని ఆయన స్పష్టం చేశారు.

రంజీ ట్రోఫీలో కరుణ్ పరాక్రమం
2024–25 రంజీ ట్రోఫీలో విదర్భకు కరుణ్ కీలకంగా మారాడు. మొత్తం 16 ఇన్నింగ్స్‌లు ఆడి 863 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 53.93. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టోర్నీలో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇంతలో గత చరిత్రను తలపిస్తే…
2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన కరుణ్, తన మూడో మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ (303 నాటౌట్) సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచం అతని వైపు చూసింది. కానీ 2017లో అతని చివరి టెస్టు ఆడిన తర్వాత మళ్లీ జట్టులోకి రావటం జరగలేదు. ప్రస్తుతం కరుణ్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఫిట్‌నెస్ పరంగా అతను సిద్ధంగా ఉన్నాడు. ఫార్మ్ కూడా బాగుంది. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ కుంబ్లే సలహాను పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్నదే ఆసక్తికరమైన అంశం.
గిల్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు.
ఈ నేపథ్యంలో నాలుగో స్థానాన్ని ఎవరు పట్టుకుంటారన్నది కీలకం. కరుణ్ నాయర్‌కు మరో అవకాశం వస్తే, అది భారత క్రికెట్‌కు మంచి సానుకూల సంకేతంగా మారుతుంది.
Read Also : Pakistan : సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్!