పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగిని దేశం నుంచి బహిష్కరించింది. 24 గంటల్లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

గూఢచర్య కార్యకపాలకు పాల్పడుతునే ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లో పాకిస్థాన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి భారత విదేశాంగ శాఖ ఓ లేఖ రాసింది. అయితే, ఆ అధికారి పేరును మాత్రం వెల్లడించలేదు. దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిని దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించామని విదేశాంగ శాఖ తెలిపింది. అధికార హోదాకు తగ్గట్లు ప్రవర్తించలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 24 గంటల్లోగా సదరు అధికారి భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆ అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్‌కు మంగళవారం ఆదేశాలు జారీ చేశామని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తారు. కాగా, పహల్గాం ఉగ్రవాది తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది.
Read Also : Pakistan On PM Modi Speech: కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నాం: పాక్