భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation sindoor) లో తనకు జరిగిన నష్టాలను పాక్ మెల్లగా వెల్లడిస్తోంది. తాజాగా 11 మంది సైనికులు మరణించగా.. మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలియజేసింది. ఇక పాకిస్థాన్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది మృతి చెందారని.. వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు తెలిపింది. భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో 40 మంది పౌరులు చనిపోగా.. 121 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈమేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని ఆ దేశ సైన్యం అధికారికంగా తెలిపింది. మొదట వాస్తవాలను దాచిన పాక్, నెమ్మదిగా నష్టాలను బహిర్గతం చేస్తోంది.

మీడియా సమావేశంలో నష్టాలపై వివరణ
నిన్న కూడా పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ (Ammad sharif) చౌధరీ.. తమ దేశ ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో మన వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైంది’’ అని వెల్లడించారు. అయితే, ఆ నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలను ఆయన బయటపెట్టలేదు.
పాక్ వాయుసేనకు భారీ దెబ్బ
మరోవైపు భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఇటీవల మీడియా బ్రీఫింగ్స్‌లో మాట్లాడుతూ, తాము పాక్ యుద్ధ విమానాలను కూల్చేసినట్లు ధ్రువీకరించారు. అయితే.. ఆ శకలాలు పాకిస్థాన్‌లోనే పడిపోయినట్లు చెప్పారు. కూలిపోయిన విమానం పాక్‌కు చెందిన మిరాజ్ కావచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ (Ammad sharif)చౌధరీ వాయుసేన, నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ, “భారత్‌తో ఘర్షణలో పాక్ యుద్ధ విమానం ధ్వంసమైంది” అని పేర్కొన్నారు. అయితే విమానం ధ్వంసం స్థాయి, మిగిలిన వివరాలను వెల్లడించలేదు.
Read Also: Schools Reopen: విద్యాసంస్థల పునఃప్రారంభానికి సిద్ధం!