వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్-పాకిస్థాన్ (India-Pak)మధ్య యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) చెప్పారు. అనేక అణ్వాయుధాలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ప్రమాదకర పోరాటం జరుగుతున్న సమయంలో అమెరికా యంత్రాంగం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించిందని ట్రంప్ వివరించారు. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలమంది ప్రాణాలు పోయి ఉండేవని తెలిపారు. భారత్–పాకిస్థాన్ (India-Pak) మధ్య అణు యుద్ధం జరుగుతున్న సంక్షోభ సమయాన్ని వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చి నివారించానని డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తెలిపారు. “మేము వారిని వాణిజ్యంతో ఒత్తిడి చేశాం” అని పేర్కొన్నారు. “మీరు యుద్ధం ఆపకపోతే వాణిజ్యాన్ని ఆపేస్తాం” అని స్పష్టంగా చెప్పినట్టు చెప్పారు.

రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తత
“భారత్, పాకిస్తాన్ (India-Pak) రెండు దేశాల నాయకత్వాలు దృఢంగా, శక్తిమంతంగా ఉన్నాయని మీకు తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నా. వారు వాస్తవ పరిస్థితి తీవ్రతను పూర్తిగా తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి జ్ఞానం, ధైర్యాన్ని కలిగి ఉన్నారు. మేం చాలా సాయం చేశాం. వాణిజ్యంతో సాయం చేశాం. మనం కలిసి చాలా వాణిజ్యం చేద్దామని వాళ్లకి చెప్పాను. ఈ ఘర్షణను ఆపండి ఆపండి. మీరు ఆపితేనే మనం వాణిజ్యం చేద్దాం. మీరు ఆపకుంటే మీతో ఎలాంటి వాణిజ్యాన్ని చేయబోమని చెప్పాను. అణు యుద్ధాన్ని నివారించడంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన కృషికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. “వారు చాలా కష్టపడ్డారు. ఇది మాకు చాలా పెద్ద విజయం” అని పేర్కొన్నారు.
భారత్, పాకిస్థాన్‌తో వాణిజ్య చర్చలు
బహుశా ఎవరూ నా మాదిరిగా వాణిజ్యాన్ని ఇలా ఉపయోగించలేదు. తర్వాత వాళ్లు ఆపేస్తామని చెప్పారు. అలాగే చేశారు కూడా. మేం పాకిస్థాన్‌తో చాలా వాణిజ్యాన్ని చేయబోతున్నాం. భారత్‌తోనూ చాలా వాణిజ్యాన్ని చేయబోతున్నాం. ప్రస్తుతం మేం భారత్‌తో చర్చలు జరుపుతున్నాం. పాకిస్థాన్‌తోనూ త్వరలో చర్చలు జరపబోతున్నాం. మేం అణు యుద్ధాన్ని నివారించాం. ప్రమాదకర అణు యుద్ధంగా అది మారి ఉండేదని నేను అనుకుంటున్నాను. లక్షలాది మంది చనిపోయి ఉండేవారు. ఈ విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, విదేశాంగమంత్రి మార్కోరూబియోలు చాలా కష్టపడ్డారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. “ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్‌తో త్వరలో వాణిజ్య చర్చలు జరగనున్నట్లు ప్రకటించారు. అమెరికా ఇకపై రెండు దేశాలతో సహకారం పెంచాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Read Also: India Pakistan: అసిఫ్ మునీర్ క్షమాపణ చెప్పకపోతే కరాచీకి భారీ నష్టం జరిగేదే!