భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) విజయవంతం కావడం దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన వ్యూహాత్మక నైపుణ్యాన్ని, సైనిక శక్తిని మరోసారి నిరూపించుకుంది. ఈ విజయం దేశ రక్షణలో భారత సైన్యం అంకితభావాన్ని, పరాక్రమాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా విజయోత్సవంగా ‘తిరంగా యాత్ర’ (Tiranga Yatra) నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
11 రోజుల పాటు ఈ యాత్ర
బీజేపీ (BJP) ప్రకటించిన ప్రకారం, ఈ యాత్ర మే 13వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ యాత్ర జరుగనుండగా, ప్రజల్లో దేశభక్తిని, ఐక్యతను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రజలతో పంచుకోవడమే కాకుండా, భారత జెండా గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యాత్రను మలచనున్నారు.
యాటర్లో అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు
పార్టీకి చెందిన అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ యాత్రలో పాల్గొననున్నారని సమాచారం. ఈ సందర్భంగా పలు ప్రదేశాల్లో సభలు, సమావేశాలు, జాతీయ గీతాల గానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశ భద్రతపై అవగాహన కలిగించేందుకు, సైనికుల త్యాగాలను గుర్తు చేసేందుకు ఈ యాత్ర మంచి వేదికగా నిలవనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also : OG Movie : పవన్ ‘ఓజీ’పై కీలక అప్‌డేట్