భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైనిక విభాగం ISPR డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కీలక ప్రకటన చేశారు. భారత్ జరిపిన దాడులకు తమ దేశం తగిన ప్రతీకారం తీర్చుకుందన్నారు. పౌరులపై దాడులకు స్పందనగా తీసుకున్న చర్యలు పట్ల పాక్ సైన్యం కట్టుబడి ఉందని చెప్పారు.
పాకిస్థాన్ వైమానిక దళం దాడులు
చౌదరి తెలిపిన వివరాల ప్రకారం, భారత్‌లోని 26 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ వైమానిక దళం దాడులు జరిపిందని వెల్లడించారు. అంతేకాక, ఢిల్లీ, నగ్రోటా, ఫయాజ్ వంటి ప్రాధాన్య నగరాలకు డ్రోన్లు పంపామని, బ్రహ్మోస్ క్షిపణుల నిల్వ కేంద్రాలను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా, భారత్ ఆధీనంలోని S-400 క్షిపణి బ్యాటరీలను న్యూట్రలైజ్ చేసినట్లు కూడా ప్రకటించారు.
భారత్ ద్రువీకరించాల్సిన అవసరం
ఈ ప్రకటనపై భారత్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. అయితే పాక్ ఈ ప్రకటనను తీవ్రంగా రాజకీయ మరియు మానసిక యుద్ధపు భాగంగా చేస్తోందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య స్థిరమైన శాంతి స్థాపన కోసం ఈ రకమైన దాడులు, ప్రతీకార చర్యలు తప్పనిసరి కాదన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాంతీయ భద్రత క్షిణించకుండా ఉభయ దేశాలు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also : India – Pakistan War : పాక్ కాల్పుల్లో తీవ్రగాయాలు.. ఆసుపత్రిలో BSF జవాన్ మృతి