हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

Rohit sharma reaction on war: నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి .. రోహిత్‌ శర్మ

Sudha
Rohit sharma reaction on war: నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి .. రోహిత్‌ శర్మ

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వీడియోలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ఆందోళన వ్యక్తం చేశాడు. భారత సైన్యం ధైర్యాన్ని ప్రశంసిస్తూ, నకిలీ వార్తలను (fake news)నమ్మకూడదని, బాధ్యతాయుతంగా ఉండాలని కోరాడు. దేశ రక్షణలో సైన్యం పాత్రను కొనియాడారు.

Rohit sharma reaction on war :
Rohit sharma reaction on war

90 శాతం ఫేక్‌ వీడియోలు
భారత్‌ పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని విషయం తెలిసిందే. ఒక రకంగా రెండు దేశాల మధ్య అనధికారిక యుద్ధం మొదలైందని నిపుణులు అంటున్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట దాడులు చేపట్టింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ జమ్మూ కశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాలపై దాడికి యత్నించింది. కానీ, వాటిని భారత్‌ తప్పికొట్టింది. ఆ తర్వాత భారత్‌ పాక్‌పై దాడి చేసినట్లు ఇప్పటి వరకు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో పలు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో 90 శాతం ఫేక్‌ వీడియోలు, ఏఐ జనరేటెడ్‌ వీడియోలు అంటూ కొంతమంది ఫ్యాక్ట్‌ చేసి నిరూపిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఫేక్‌ వీడియోలతో పాటు, పాకిస్థాన్‌ దాడులను తిప్పికొడుతూ, పాక్‌పై దాడి చేస్తున్న సాయుధ దళాల గురించి కూడా రోహిత్‌ ఎక్స్‌ వేదికగా స్పందించాడు. “గడిచే ప్రతి క్షణం, తీసుకునే ప్రతి నిర్ణయంతో నేను మన భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నావికాదళం పట్ల చాలా గర్వంగా ఉన్నాను. మన యోధులు మన దేశ గౌరవానికి అండగా నిలుస్తున్నారు. ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండటం, నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా లేదా నమ్మకుండా ఉండటం ముఖ్యం. అందరూ సురక్షితంగా ఉండండి!” అంటూ ట్వీట్‌ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలు ఈ సందర్భంలో చాలా ముఖ్యం. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు నకిలీ వీడియోలు, అపార్థాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.

Read Also : Operation Sindoor: యుద్ధ రంగంలోకి దిగిన INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో ధ్వంసం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870