అల్లు అర్జున్‌కు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ దేశాల్లో ‘పుష్పా 2’ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. పాకిస్థాన్‌లో ‘పుష్పా’ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను తెలుపుతూ, అక్కడి యువత అల్లు అర్జున్ డైలాగ్స్‌ను అనుకరిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే, ‘ఆపరేషన్ సింధూర్’పై అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ అభిమానుల్లో కొంత అసంతృప్తిని కలిగించింది. కొంతమంది అభిమానులు ఆయనపై విమర్శలు గుప్పించారు.
అల్లు అర్జున్ ట్వీట్
ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం స్పందించారు. ” మే బీ జస్టిస్ సర్వ్‌డ్ జై హింద్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టాడు. ఇండియన్ ఆర్మీకి ఫుల్ సపోర్టు చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అభిమానుల స్పందన
అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటీ అల్లు అర్జున్ ఇండియాకు మద్దతుగానే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు కదా అలాంటిది, ఆయనపై ఆగ్రహం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మీద మండిపడుతున్నది ఇండియన్ అభిమానులు కాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫ్యాన్స్. అల్లు అర్జున్‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఇలా తమ అభిమాన హీరో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంపై అక్కడి అభిమానులు ఫైర్ అవుతున్నారు. మా అభిమాన హీరో నుంచి ఇలాంటి పోస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ బాధపడుతున్నారు.అల్లు అర్జున్ చేసిన పోస్ట్‌పై 40వేలకు పైగా కామెంట్స్, 100వేల డిజప్పాయింట్‌మెంట్ రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు ఆ పోస్ట్ డిలీట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇది చూసిన వారందరూ అల్లు అర్జున్‌కు ఇండియాలోనే కాకుండా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కూడా ఇంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
Read also: RGV: ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ