పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య ఐశన్య ద్వివేది భావోద్వేగంగా స్పందించారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై జరిగిన దాడి ఓ సాధారణ ప్రతీకారం కాదని, అది తన భర్తకు అర్పించిన ఘన నివాళి అని అన్నారు. ప్రధాని మోదీ తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడారు. ‘ఇది నా భర్త త్యాగానికి నిజమైన గౌరవం. ఆయన ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందనే నమ్మకం ఉందన్నారు. నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ భారత సైన్యాన్ని ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య ఐశన్య ద్వివేది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది మాట్లాడుతూ, భారత సైన్యం తీసుకున్న చర్య దేశ ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించిందని అన్నారు. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాము అంటూ చెప్పారు. దేశ ప్రజల బాధల్ని విన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.. పాకిస్తాన్‌లో విజృంభిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ఎలా నాశనం చేసిందో, దానికి తమంతా మన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను… ఈ వార్త విన్నప్పటి నుండి మా కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉందని శుభం తండ్రి అన్నారు. శుభం ద్వివేది బంధువు మనోజ్ ద్వివేది మాట్లాడుతూ, బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్నో యువకుడు శుభం ద్వివేది త్యాగానికి గౌరవంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఆయన భార్య ఐశన్య ద్వివేది స్పందిస్తూ దీన్ని కేవలం ప్రతీకార చర్యగా కాకుండా, భర్తకు అర్పించిన గౌరవంగా అభివర్ణించారు.
Read Also: Visa: వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్న బ్రిటన్