Anganwadi : తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచిన ప్రకటన: 3,989 మందికి ప్రమోషన్, జీతాల్లో భారీ పెంపు
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్ల వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఇది శుభవార్తగా మారింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను పూర్తి స్థాయి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేయనుంది.ఇప్పటివరకు మినీ అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.7,800 మాత్రమే వేతనం అందుతుండగా, తాజా నిర్ణయంతో వీరికి రూ.13,650 వేతనం ఇవ్వనున్నారు. పెంచిన జీతం ఏప్రిల్ 2025 నెల నుంచే అమల్లోకి రానుంది. దీనివల్ల మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ టీచర్లుగా కొనసాగనుండడంతో ఇకపై మినీ, మెయిన్ అనే తేడా ఉండదు.

Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు వేతనం పెంపు
ఈ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ టీచర్లు ఆనందం వ్యక్తం చేశారు. తమ సేవలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చినందుకు వారు మంత్రి సీతక్కకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వేతనాల పెంపుతో పాటు ప్రమోషన్ రావడం తమ కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందని టీచర్లు పేర్కొన్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేక కుటుంబాలకు నూతన ఆశలు కలిగించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ సేవలు మరింత బలోపేతం చేయడానికి దోహదం చేస్తుంది. ప్రభుత్వ వైఖరి పట్ల అంగన్వాడీ ఉద్యోగుల సమాఖ్యలు సంతోషం వ్యక్తం చేస్తూ, త్వరలోనే పథకాల అమలు పట్ల మరిన్ని సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.
Read More : Gali Janardhan Reddy: ఎట్టకేలకు గాలి జనార్ధన్ రెడ్డి కి 7 ఏళ్ల జైలు శిక్ష