మాక్ డ్రిల్‌కు హైదరాబాద్ సిద్ధం – యుద్ధ పరిస్థితుల్లో ప్రజల భద్రతకు తర్ఫీదు
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానులతో పాటు ముఖ్య నగరాలలో మాక్ డ్రిల్లులు నిర్వహించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ హోంశాఖకు సమాచారం అందగా, మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మొహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులతో చర్చించారు. మాక్ డ్రిల్ ద్వారా యుద్ధ పరిస్థితుల్లో ప్రజల స్వీయ రక్షణకు తర్ఫీదు ఇవ్వాలని ఆయన సూచించారు. అగ్నిమాపక, విద్యుత్ ప్రాజెక్టులు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో మాక్ డ్రిల్ నిర్వహణకు ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డిని నోడల్ అధికారిగా నియమించారు.బుధవారం నాడు హైదరాబాద్‌లో జరిగే ఈ సెక్యూరిటీ డ్రిల్ ద్వారా ప్రజలు యుద్ధ సమయంలో ఎలా స్పందించాలి? ఎలాంటి అపాయాలను ఎలా ఎదుర్కొనాలి? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించనున్నారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో, 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో మాక్ డ్రిల్లులు నిర్వహించబడ్డాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా ఏకకాలంలో మాక్ డ్రిల్ జరగడం చాలా అరుదైన సందర్భంగా భావిస్తున్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో మాక్ డ్రిల్: యుద్ధ సమయంలో భద్రత
గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో, 1971లో భారత్–పాక్ యుద్ధ సమయంలో మాక్ డ్రిల్లులు నిర్వహించబడ్డాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా ఏకకాలంలో మాక్ డ్రిల్ జరగడం చాలా అరుదైన సందర్భంగా భావిస్తున్నారు.హైదరాబాద్‌లో ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, పార్కుల వద్ద మాక్ డ్రిల్లులు నిర్వహించిన అనుభవం ఉన్నా, ఈసారి మరింత వ్యాప్తిలో ఈ కార్యక్రమం జరగనుంది. అగ్ని ప్రమాదాల నుండి రక్షణ, గాయపడిన వారికి ప్రథమ చికిత్స, ఆసుపత్రులకు తరలింపు వంటి అంశాలు ఇందులో భాగం. ఉగ్రదాడులు జరిగితే, బాంబులు పడి పేలితే, తుపాకులతో కాల్పులు జరిగితే ప్రజలు ఎలా స్పందించాలి?, ఎలా తప్పించుకోవాలి?, ఎలా ఇతరులను కాపాడాలి? అనే అంశాలను కూడా పోలీస్ శాఖ ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు వివరించనుంది. ఈ నెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మాక్ డ్రిల్లులు చేపట్టనున్నారు.
Read More : Telangana : తెలంగాణ యువ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ మూడు పతకాలు గెలిచింది