हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Obulapuram : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి 7 ఏళ్ల జైలు శిక్ష,

Digital
Obulapuram : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి 7 ఏళ్ల జైలు శిక్ష,

ఉమ్మడి ఎపిలో సంచలనం సృష్టించిన ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్ కేసులో 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఎ1గా వున్న గాలి శ్రీనివాస్ రెడ్డి, ఎ2గా వున్న అతని సోదరుడు కర్నాటక ఎంఎల్ఎ గాలి జనార్ధన్ రెడ్డి, ఎ3గా ఉన్న నాటి ఎపి గనుల శాఖ డైరక్టర్ రాజగోపాల్, ఎ4గా వున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి, ఎ7గా వున్న మెఫ జ్ అలీ ఖాన్ కు సిబిఐ కోర్టు ఏడేళ్ల శిక్షను ఖరారు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారి కృపానందంలను సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఎ5గా వున్న లింగారెడ్డి మరణించగా ఎలాగా వున్న ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మీని కేసు నుంచి తెలంగాణ హైకోర్టు ఇదివరకే డిశ్చార్జి చేసింది. అయితే నాటి గనుల శాఖ డైరక్టర్ ఎ3 నిందితుడు రాజగోపాల్కు అవినీతి నిరోధక చట్టం కింద మరో నాలుగేళ్ల శిక్ష అదనంగా పడింది. ఉమ్మడి ఎపిలో ఓబుళాపురం మైనింగ్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపడం తెలిసిందే.

ఎపిలోని అనంతపురంలో గనులను లీజుకు తీసుకుని మరోచోట అక్రమంగా మైనింగ్ చేసినట్లు అభియోగాలు వచ్చాయి. 2007 జూన్ 18వ తేదీన ఓఎంసికి లీజులు కేటాయిస్తూ అప్పటి వైఎస్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించారంటూ వచ్చిన ఆరోపణలపై 2009 డిసెంబర్ ఏడవ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో సిబిఐ అధికారులు ఐపిసి 120 (బి), రెడ్విత్ 420, 409, 468, 471లతో పాటు సెక్షన్ 13 (2), రెడ్ విత్ 13 (1) డి కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును నాటి సిబిఐ జాయింట్ డైరక్టర్ వివి లక్ష్మీనారాయణ విచారించారు. ఆయన నేతృత్వంలోని సిబిఐ బృందం హైదరాబాద్ నుంచి బళ్లారికి వెళ్లి రెండు రోజుల పాటు కాపుకాసి గాలి జనార్దన్ రెడ్డి సహా ఇతర నిందితులను అరెస్టు చేయడం, వీరందరిని భారీ బందోబస్తు మధ్య రోడ్డు మార్గాన హైదరాబాద్ కు తీసుకురావడం అప్పట్లో సంచలనం రేపింది. అనంతరం వీరిని చంచల్గూడ జైల్లో నిర్బంధించారు. చంచల్గూడ జైల్లో గాలి జనార్ధన్ రెడ్డి సహా ఇతర నిందితులు ఏడాదిన్నరకు పైగా వున్నారు. కాగా ఇదే కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి నాటి సిబిఐ కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు అక్రమంగా బెయిల్ ఇచ్చినందుకు అరెస్టయి జైలు పాలవడం మరో సంచలనం రేపింది. ఈ కేసులో పట్టాభి రామారావుకు గాలి జనార్ధన్ రెడ్డి వంద కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అభియోగాలు వచ్చాయి.

 Obulapuram : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి 7 ఏళ్ల శిక్ష,
Obulapuram : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి 7 ఏళ్ల శిక్ష,

Obulapuram : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి 7 ఏళ్ల శిక్ష,

ఇలా ఓబుళాపురం కేసులో మొదటి నుంచి అన్ని అంశాలు సంచలనం రేపాయి. ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో స్టే రావడం, డివిజన్ బెంచ్ దీనిని ఎత్తేయడం, పలురకాల పిటిషన్ల కారణంగా దాదాపు 15 ఏళ్ల పాటు విచారణ సాగింది. ఈ క్రమంలోనే కేసు విచారణకు ఐదేళ్ల సమయం పట్టింది. 2009 నుంచి 2014 వరకు ఓబుళాపురం మైనింగ్ కేసులో సిబిఐ నాలుగు ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఇందులో 2011లో మొదటి చార్జిషీట్ దాఖలు చేయగా 2014లో చివరి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 219 మంది సాక్షులను విచారించగా ప్రత్యక్షంగా పరోక్షంగా వలు సాక్ష్యాలు, ఆధారాలను సిబిఐ సేకరించి కోర్టుకు సమర్పించింది. ఓబుళాపురం గనుల కేటాయింపు, తవ్వకాలకు సంబంధించి అత్యాధునిక పరికరాలతో సిబిఐ ఆధారాలను సేకరించింది. అక్రమంగా తవ్వకాలు చేయడం, రవాణా, ఎగుమతులు, విక్రయాలలో భారీగా అవకతవకలు జరిగినట్లు సిబిఐ గుర్తించింది. ఎపి, కర్నాటకలో పెద్ద ఎత్తున అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వకాలు చేసినట్లు సిబిఐ గుర్తించింది. ఓబుళాపురం గనుల నుంచి విదేశాలకు అక్రమంగా 60 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఎగుమతి అయినట్లు సిబిఐ గుర్తించింది, ఇదంతా అక్రమ, బినామీ లావాదేవీల వల్ల జరిగిందని సిబిఐ విచారణలో తేలింది.

మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి 7 ఏళ్ల శిక్ష,

ఈ కేసు విచారణలో భాగంగా 3337 డాక్యుమెంట్లను సిబిఐ అధికారులు పరిశీలించారు. ఓబుళాపురం గనుల తవ్వకాలలో సర్కారు కేటాయించిన 68 హెక్టార్లలో కాకుండా ఇతరచోట్ల భారీగా అక్రమంగా మైనింగ్ చేసినట్లు సిబిఐ గుర్తించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు 844 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్న సిబిఐ ఇదే అంశాన్ని ఛార్జిషీట్లో పొందుపరిచింది. ఈ కేసు విచారణలో భాగంగా 219 సాక్షులను న్యాయస్థానం ఎదుట సిబిఐ హాజరు పరిచి వారి వాంగ్మూలాన్ని కోర్టులో పొందుపరిచింది. దీని ఆధారంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నాటి గనుల శాఖ మంత్రిగా వున్న సబిత ఇంద్రారెడ్డి మినహా మిగతా నిందితులంతా అరెస్టయి జైలుకు వెళ్లారు. ఈ కేసులో తన పాత్ర లేదని సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్ వేసినా కోర్టు దానిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. దీనిపై మంగళవారం తుది తీర్పు రానుందని ముందుగానే తెలియడంతో నాంపల్లి కోర్టుల ప్రాంగణం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పు నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి, సబిత రెడ్డి సహా పలువురు కోర్టుకు హాజరయ్యారు. చివరకు దీనిపై సిబిఐ కోర్టు తుది తీర్పులో ఎ1గా వున్న గాలి శ్రీనివాస్ రెడ్డి, ఎ2గా వున్న గాలి జనార్దన్ రెడ్డి, ఎ3గా వున్న విడి రాజగోపాల్, ఎ4గా వున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి, ఎ7గా వున్న అలీ ఖాన్ తో పాటు ఓఎంసి కంపెనీకి సిబిఐ కోర్టు ఏడేళ్ల శిక్షను, వది వేల రూపాయల జరిమానాను విధించింది.

కోర్టు తీర్పు వెలువరించే సమయంలో కోర్టు హాల్లోనే వున్న గాలి జనార్దన్ రెడ్డి తనకు శిక్షను తగ్గించాలని వేడుకున్నారు. తాను ఇప్పటికే నాలుగేళ్ల పాటు జైల్లో వున్నానని, ప్రస్తుతం ఎంఎల్ఎగా వున్నానని, ప్రజా జీవితంలో వుండాల్సి వుండడంతో శిక్షను తగ్గించాలని కోరగా దీనికి న్యాయమూర్తి మండిపడ్డారు. మీరు యావజ్జీవ శిక్షకు అర్హులని తెలిపారు. మీకు పదేళ్ల శిక్ష ఎందుకు విధించకూడదని ప్రశ్నించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నాటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారి కృపానందంలను సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిద్దరిపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. కాగా ఈ కేసులో నాటి గనుల శాఖ డైరక్టర్ విడి రాజగోపాల్కు అదనంగా మరో నాలుగేళ్ల జైలు శిక్షను సిబిఐ కోర్టు విధించింది. అప్పట్లో ఆయన భూగర్భ గనుల శాఖ డైరక్టర్గా వున్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను కోర్టు విధించింది. ప్రభుత్వ అధికారిగా వుంటే అక్రమాలకు పాల్పడినందుకు రాజగోపాల్కు మొత్తం మీద 11 ఏళ్ల జైలు శిక్ష పడింది.

Read More : Pope: ప్రపంచవ్యాప్తంగా కాథలిక్కులు కొత్త పోప్ నుండి ఏమి ఆశిస్తున్నారు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

📢 For Advertisement Booking: 98481 12870