టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్తగ కనిపించబోతున్నారు.ఎన్నో విజయవంతమైన సినిమాల తర్వాత, ఇప్పుడు ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.తన సొంత బ్యానర్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ‘శుభం’ అనే సినిమా నిర్మించారు.ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.‘శుభం’ సినిమా మే 9న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సమంత తన అనుభవాలు పంచుకున్నారు.నటిగా తన ప్రయాణం గురించి కాదు, ఈసారి నిర్మాతగా తలపడిన సవాళ్లు గురించి మాట్లాడారు.నటిగా ఉన్నప్పుడు ఒక పాత్ర మీదే దృష్టి ఉంటుంది.కానీ నిర్మాతగా అయితే, ప్రతి చిన్న విషయం చూసుకోవాలి, అని సమంత అన్నారు.

ఒక సన్నివేశం తప్పుగా వస్తే, రీషూట్ అంటే ఖర్చే అని చెప్పారు. ఇటీవల ఒక షాట్ రిపీట్ చేయాల్సి వచ్చింది. అప్పటివరకు ఈ పని ఎంత ఖర్చుతో కూడుకున్నదో నాకు తెలియలేదు,” అని చెప్పిన సమంత అనుభవం ఎంత నిజమైనదో అర్థమవుతుంది.స్క్రిప్ట్, షెడ్యూల్, బడ్జెట్ అన్నీ సమన్వయపరిచే బాధ్యత నిర్మాతపైనే ఉంటుంది. “ఒక్కరోజు షూటింగ్ ఆలస్యం అయితే, యూనిట్ ఖర్చు అమాంతం పెరుగుతుంది,” అని ఆమె వివరించారు.
నిర్మాతగా వ్యవహరించడం తాను ఊహించిన దానికంటే కష్టమని అంగీకరించారు.తనకి మొదటి అవకాశం ఇచ్చిన గౌతమ్ మీనన్‌ను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు తాను కూడా కొత్త టాలెంట్‌కి ఛాన్స్ ఇచ్చిందని చెప్పారు. ‘శుభం’ సినిమాలో శ్రియా, శ్రావణి, షాలిని వంటి యువ నటీమణులు నటించారు. వాళ్లంతా ఎంతో కష్టపడ్డారని, వారి పనితనంతో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.ఈ సినిమా కథ సీరియల్ ప్రపంచం చుట్టూ తిరిగే సెటైరికల్ డ్రామా,” అని సమంత వివరించారు. వసంత్ అందించిన కథ చాలా బలంగా ఉందని, అందుకే ఆ కథకే న్యాయం చేసేలా బడ్జెట్ ఖర్చుపెట్టామని చెప్పారు. అనవసరంగా డబ్బు వెయ్యలేదని, ప్రతీ రూపాయి బాగా ఉపయోగపడిందని స్పష్టంచేశారు.నిర్మాతగా ఇది తన మొదటి ప్రయత్నం అయినా, చాలా బాగుందని అభిమానులు భావిస్తున్నారు. ‘శుభం’ సినిమా కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా అని చెప్పారు. ప్రేక్షకుల ఆదరణే తనకు పెద్ద విజయమని అభిప్రాయపడ్డారు.
Read Also : Jayaprada : ధర్మేంద్రతో మధుర క్షణాలు పంచుకున్న జయప్రద!