భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేందుకు వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ పరోక్షంగా ప్రతిచర్యలు ప్రారంభించింది. ఇప్పటికే బాగ్లిహార్ డ్యామ్ నీటి సరఫరా నిలిపివేయగా, తాజాగా జమ్ముకశ్మీర్‌లోని సలాల్ డ్యామ్‌ను కూడా మూసివేసింది. ఈ రెండు డ్యామ్ల రిజర్వాయర్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ పూడికతీత పనులు చేపట్టింది. ఇందులో భాగంగా ఫ్లషింగ్ ప్రక్రియ ద్వారా బురద తొలగింపు కార్యక్రమాలు గత వారం మూడు రోజులపాటు సాగాయి.సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, ఇప్పుడు పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే భారత్ ఈ పనులు చేస్తోంది. గతంలో ఇలాంటి పనులకు పాక్ అభ్యంతరం తెలిపింది. కానీ ఒప్పందం రద్దైన నేపథ్యంలో భారత్ పూర్తి స్వాతంత్యంతో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. బాగ్లిహార్ (900 మెగావాట్లు), సలాల్ (690 మెగావాట్లు) ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచే యోచనతో భారత్ ముందుకు సాగుతోంది.

Bharat : పాకిస్థాన్‌కు షాక్: భారత్ సలాల్, బాగ్లిహార్ డ్యామ్స్ మూసివేత
ఇటీవలి చర్యల వల్ల చీనాబ్ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో పాకిస్థాన్ వైపు వరద పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లో నిలిచిపోయిన ఆరు జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇవి పూర్తయితే మొత్తం 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్‌కు కేవలం విద్యుత్ ఉత్పత్తికి డ్యాంలు నిర్మించేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం అమల్లో లేకపోవడంతో భారత్ పెద్ద ఎత్తున నీటి నిల్వ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మార్గం వీలైంది. ఈ చర్యలన్నింటినీ నిపుణులు పాకిస్థాన్ వ్యవసాయ రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే చర్యలుగా విశ్లేషిస్తున్నారు.ఈ చర్యలపై కేంద్ర జల సంఘం మాజీ అధిపతి కుష్వీందర్ వోహ్రా మాట్లాడుతూ, “ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తన ప్రాజెక్టుల్లో ఇష్టమైన మార్పులు చేసుకోవచ్చు. పాక్ నుంచి ఆమోదం అవసరం లేదు” అని చెప్పారు.
Read More : PM Modi: ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి కీలక భేటీ