తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారి, రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురిసినట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అలాగే, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేశారు.

Telangana : తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు
మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పిడుగుల వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గురువారం మరియు శుక్రవారం రోజులలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Read More : Rajinikanth: రజనీకాంత్ రిటైర్మెంట్ తనకు సమాధానం తెలియదని భార్య