సికింద్రాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతమైన ప్యాట్నీ సెంటర్ వద్ద ఉన్న ఎస్బిఐ ప్రధాన శాఖ భవనంలో ఈ రోజు సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీప ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగతో ఆ ప్రాంతం నిండిపోయింది. మంటలు గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు.
Read Also : Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు
అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. నాలుగో అంతస్తులోనే మంటలు తీవ్రంగా ఉన్నప్పటికీ, వాటిని తక్షణమే అదుపులోకి తీసుకురావడానికి అధికారులు యత్నిస్తున్నారు. సెలవుదినం కావడంతో భవనంలో సిబ్బంది లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణహానీ జరగకపోవడం ఊరట కలిగించే విషయం.
బ్యాంకు ఆస్తికి ఎంత మేర నష్టం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్బిఐ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంటల కారణంగా బ్యాంకు ఆస్తికి ఎంత మేర నష్టం వాటిల్లిందన్నదిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు మాత్రం విచారణ అనంతరం వెల్లడించనున్నారు.
#Hyderabad : #FireAccident
A massive #fire broke out on the 4th floor of the State Bank of India (#SBI) Administrative building at the #PatnyCenter in #Secunderabad
Fire spreading rapidly on the other floors of the building, huge #Flames can be seen.
Fire engines have… pic.twitter.com/fJA9qExpKl— Surya Reddy (@jsuryareddy) May 4, 2025