తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మరింత ప్రభావితమవుతుంది. భారత వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం, రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం మొదలవగా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మంగళవారం పిడుగులు పడే అవకాశమూ ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీకి సంబంధించిన వర్షాల సమాచారం
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీస్తాయని, ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడంతో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విద్యుత్ కోతలు, రహదారి పైకి వరద నీరు రావడంలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున, అధికారులు మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Read Also : http://Caste Census 2025 : కులగణన విషయంలో బీజేపీ వ్యూహం అదేనా..?