గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తాజాగా సీఈఓ సుందర్ పిచాయ్‌కి 2024లో చెల్లించిన వేతన వివరాలను వెల్లడించింది. ఈ సారి పిచాయ్‌కి దక్కిన మొత్తంలో గణనీయమైన తగ్గుదల ఉండడం చాలామందిని ఆశ్చర్యంలో ముంచింది. అయితే ఇందుకు ఓ స్పష్టమైన కారణం కూడా ఉంది.ఆల్ఫాబెట్ 2025 ప్రాక్సీ స్టేట్‌మెంట్ ప్రకారం, సుందర్ పిచాయ్‌కి 2024 సంవత్సరానికి గాను 10.72 మిలియన్ డాలర్లు (దాదాపు ₹89 కోట్లు) వేతనంగా అందింది. ఇది 2022లో వచ్చిన 226 మిలియన్ డాలర్లతో పోలిస్తే బోలెడు తక్కువ. అప్పట్లో ఆయన్ను భారీగా స్టాక్ అవార్డులు వరించాయి. కానీ ఈసారి ఆ అవకాశమే లేనట్టైంది.ఇంత పెద్ద తేడాకు ప్రధాన కారణం స్టాక్ అవార్డుల లేకపోవడమే. 2022లో అందిన భారీ మొత్తంలో పెద్ద భాగం మూడేళ్లకోసారి వచ్చే స్టాక్ అవార్డుల రూపంలో ఉంది. 2024లో అలాంటి అవార్డులు ఏవీ లేవు.

అందుకే మొత్తం వేతన ప్యాకేజీ కూడా తక్కువగానే ఉంది.అయినా, పిచాయ్‌కి అందే బేసిక్ శాలరీ మాత్రం మారలేదు — ఇది 2 మిలియన్ డాలర్లే. మిగతా మొత్తం అంటే 8.72 మిలియన్ డాలర్లు స్టాక్ అవార్డులు, బోనస్‌లు, ఇతర అలవెన్సులుగా ఇచ్చారు.వేతనం తగ్గినా, పిచాయ్ భద్రత కోసం సంస్థ వేసిన ఖర్చు మాత్రం గణనీయంగా పెరిగింది. 2024లో ఆయన వ్యక్తిగత భద్రత కోసం ఆల్ఫాబెట్ 8.27 మిలియన్ డాలర్లు (₹69 కోట్లు) ఖర్చు చేసింది. ఇది గత ఏడాది ఖర్చైన ₹56 కోట్లతో పోలిస్తే దాదాపు 22% ఎక్కువ.అంతేగాక, ఈ సంవత్సరం పిచాయ్ ఎక్కువగా దేశ విదేశాలకు ప్రయాణించినట్లు సమాచారం.
అందుకే ఆయన భద్రత కోసం ఏర్పాటు చేసిన సేవలు కూడా విస్తృతంగా ఉండాయంటున్నారు.ఆల్ఫాబెట్ ఈ ఖర్చులపై స్పందిస్తూ, “ఇది పూర్తిగా ఉద్యోగ సంబంధిత భద్రత. ఇందులో నివాస భద్రత, కార్-డ్రైవర్ సేవలు, ట్రావెల్ మానిటరింగ్ వంటి అంశాలు ఉన్నాయి,” అని చెప్పింది.పిచాయ్‌కు ఈ భద్రతా ఏర్పాట్లను వ్యక్తిగత ప్రయోజనంగా పరిగణించలేమని కూడా సంస్థ తెలిపింది. ఎందుకంటే ఇవన్నీ ఆయన ఉద్యోగ బాధ్యతల రీత్యా అవసరమయ్యే భాగాలేనని ఆల్ఫాబెట్ స్పష్టం చేసింది.సుందర్ పిచాయ్ వేతనం ఈసారి తగ్గినా, ఇది ఆయన్ను విస్మరించినట్లు కాదని స్పష్టంగా తెలుస్తోంది. గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలో టాప్ పొజిషన్‌లో ఉండటం అంటే, భారీ భద్రతా అవసరాలు సహజమే. ఆల్ఫాబెట్ దానిపై పూర్తి జాగ్రత్త తీసుకుంటోంది.
Read Also : Pakistan: యుద్ధ సంకేతాల మధ్య పాక్ సర్కారు అలర్ట్