కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధించి నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) చార్జిషీట్ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నిందితులు వచ్చే విచారణ తేదైన మే 8న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.ఈడీ తన చార్జిషీటును 2025 ఏప్రిల్ 9న మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3 మరియు 4 కింద దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా గాంధీని ఏ1, రాహుల్ గాంధీని ఏ2 నిందితులుగా పేర్కొంది. అంతేకాక, కాంగ్రెస్ నేతలు సామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చింది. ఈ మొత్తం కేసు నేషనల్ హెరాల్డ్ అనే చారిత్రక వార్తాపత్రికకు సంబంధించినది. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన ఈ పత్రికకు చెందిన ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) ద్వారా చాలా తక్కువ ధరకు కాంగ్రెస్ నేతలు స్వాధీనం చేసుకున్నారని ఈడీ ఆరోపించింది.

Sonia-Rahul : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులు
ఈడీ ప్రకారం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.50 లక్షలకే యంగ్ ఇండియన్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ సంస్థలో సోనియా గాంధీకి 38 శాతం, రాహుల్ గాంధీకి 38 శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లు యంగ్ ఇండియన్‌కు బదిలీ చేయడం ద్వారా భారీ ఎత్తున ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అభియోగం.ఈ లావాదేవీ మనీలాండరింగ్‌కు సంబంధించినదిగా పేర్కొంటూ, ఇది పీఎంఎల్‌ఏ చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. విచారణకు ముందే ఈడీ ఆరోపణలు, కాంగ్రెస్ నాయకులపై న్యాయపరమైన చర్యల నేపథ్యంలో రాజకీయ వేడి పెరిగే అవకాశం ఉంది.
Read More : Bilawal Bhutto: ఉగ్రవాదులతో తమ సంబంధం నిజమే: బిలావల్ భుట్టో