తెలుగు సినీ ప్రేమికులకు చిరకాల మెమొరీస్‌ను అందించిన క్లాసిక్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి.మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ, ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.ఈ సినిమా ఇప్పుడు తిరిగి స్క్రీన్ మీద కనిపించబోతోంది.వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, మే 9న గ్రాండ్ రీ రిలీజ్ కు ప్లాన్ సిద్ధమైంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి, అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఉందని ఆయన అన్నారు.”ఈ పాటను ఒక్క రోజులోనే రికార్డ్ చేశాం అంటే నమ్మడం కష్టం.ఉదయం 9 గంటలకు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు స్టూడియోలోకి వచ్చారు. మేము అప్పటికే మరో సెట్‌లో షూటింగ్‌లో ఉన్నాం.

అప్పుడే ఈ ట్యూన్ పంపారు,”అని చిరు గుర్తు చేసుకున్నారు.”ట్యూన్ వింటూనే.నాతో పాటు రాఘవేంద్రరావు గారు, దత్తు గారు కూడా ఫిదా అయ్యాం.రిథమ్ కొత్తగా ఉంది.సింపుల్‌గా, ఎంతో మధురంగా అనిపించింది.వెంటనే రచయిత వేటూరి గారిని పిలిచి, లంచ్ టైమ్‌లోనే పాట రాయించాం.‘అమ్మనీ కమ్మనీ దెబ్బ.. యబ్బా!’ అని మొదలై, మాటల మైమరపించేశాయి,” అని చిరు ఉత్సాహంగా చెప్పారు.ఆ పాటకు మజా తెచ్చినది మాత్రం ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం. ఆయన గొంతుతో పాట మరింత జీవంతో నిండిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు, ఈ పాట ఎన్నో జనరేషన్లను ఆకట్టుకుంటూనే ఉంది.జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని విజువల్స్, పాటలు, స్టోరీ – అన్నీ కలిపి ఓ మ్యాజిక్. ప్రత్యేకించి శ్రీదేవి, ఆమె పాత్ర, నటన ఈ సినిమాకు సరికొత్త మలుపు తీసుకువచ్చాయి.ఈ సినిమాను మళ్లీ థియేటర్‌లో చూసే అవకాశం రావడం సినిమా అభిమానులకు పండగే. నేటి యువత ఈ గొప్ప క్లాసిక్‌ను పెద్ద స్క్రీన్ మీద చూడటం అదృష్టమే.
Read Also : Hit 3: భారీ ఆదాయాన్ని కొట్టిన ‘హిట్ 3’