हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Chandrababu Naidu: టెక్ దిగ్గజాలతో చంద్రబాబు కీలక ఒప్పందం

Sharanya
Chandrababu Naidu: టెక్ దిగ్గజాలతో చంద్రబాబు కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. భవిష్యత్తు టెక్నాలజీలకు అత్యాధునికంగా నిలవనున్న “క్వాంటం వ్యాలీ” స్థాపన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ చారిత్రక ప్రక్రియలో ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టి (L&T) వంటి దేశీయ, టెక్ దిగ్గజాలు భాగస్వాములయ్యాయి.

ఉండవల్లిలో అవగాహన ఒప్పందాలు

ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోఈ సమావేశాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలకు హాజరయ్యారు. ఈ ఒప్పందాలు కేవలం అభివృద్ధికి మార్గదర్శకాలు కాక, భారతదేశాన్ని గ్లోబల్ క్వాంటం మ్యాప్‌పై నిలబెట్టే శక్తివంతమైన అడుగులుగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఐబీఎం, అత్యాధునిక 156-క్యూబిట్ సామర్థ్యం గల ‘క్వాంటం సిస్టం 2’ ను అమరావతిలో నెలకొల్పనుంది. ఇది 2026 జనవరి 1 నాటికి కార్యరూపంలోకి వస్తుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యవస్థకు హెరాన్ ప్రాసెసర్‌ అనే అత్యాధునిక చిప్ ఆధారంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అగ్రశ్రేణి క్వాంటం కంప్యూటింగ్ మోడల్స్‌లో ఒకటి.

అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో ఐటీ విప్లవానికి ఏపీ ఊతమిచ్చినట్లే, ఇప్పుడు క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “ఇది ఏపీకే కాదు, దేశానికే చారిత్రక దినం” అని ఆయన అన్నారు. భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు క్వాంటం కంప్యూటింగ్ పునాది అవుతుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలన్నారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవంతో, దీన్ని కూడా వేగంగా పూర్తి చేస్తామని, ఎల్&టీకి ఇప్పటికే స్థలం కేటాయించామని తెలిపారు. పనుల పర్యవేక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

కమిటీలు, పర్యవేక్షణ

ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగేందుకు రెండు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఒకటి నిర్మాణ పనుల పర్యవేక్షణ కమిటీ, మరొకటి శాస్త్రీయ, పరిశోధనా అంశాల సమన్వయ కమిటీ. L&T నిర్మాణానికి ఇప్పటికే ప్రాథమిక నమూనాలు సమర్పించినట్లు సమాచారం. భారత్‌లో ఐబీఎం క్వాంటం సిస్టం 2ను స్థాపించడం దేశ క్వాంటం ప్రయాణంలో కీలక మలుపు అని ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా అన్నారు. ఈ భాగస్వామ్యం క్వాంటం అల్గారిథమ్‌ల అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. క్వాంటం, క్లాసికల్ వ్యవస్థల అనుసంధానంతో జీవశాస్త్రం, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పరిశోధన, అభివృద్ధికి ఊతం లభిస్తుందని టీసీఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Read also: Narendra Modi: భారీ భద్రత మధ్య సభ ప్రాగణం చేరుకున్న మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870