సామాన్యులకు ఎంతో అవసరమైన గ్యాస్ ధరలు కాస్త తగ్గాయి.. వాణిజ్య వ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి.. చమురు మార్కెటింగ్ కంపెనీలు 2025 మే 1 నుంచి అమలులోకి వచ్చేలా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర గురువారం నుంచి తగ్గాయి.. అయితే.. ప్రాంతాల వారీగా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర 15రూపాయల మేర ధర తగ్గింది.. నేటి నుండి రూ.1747.50.లుగా ఉంది.
హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ 19 కేజీల ధర.. రూ.1969 గా ఉంది.. రూ.16.5 ధర తగ్గింది. 47.5 కేజీల సిలిండర్ ధర రూ.4198.50 గా ఉంది.. రూ.41.5 ధర తగ్గింది.

గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో 14.2 కేజీలది రూ.905 గా ఉంది. ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.. 5కేజీల సిలిండర్ ధర రూ.335.5 గా ఉంది. దీని ధరలో కూడా ఎలాంటి మార్పుల లేదు..
వినియోగదారులకు ఊరట ..
విజయవాడలో వాణిజ్య సిలిండర్ 19 కేజీల ధర.. రూ.1921 గా ఉంది.. రూ.44.5 ధర తగ్గింది. 47.5 కేజీల సిలిండర్ ధర రూ.4800 గా ఉంది.. రూ.110.5 ధర తగ్గింది. గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర విజయవాడలో 14.2 కేజీలది రూ.877.5 గా ఉంది. 5కేజీల సిలిండర్ ధర రూ.326 గా ఉంది.
19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు నుండి రూ.14.5 తగ్గింది. ఢిల్లీలో, 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర నేటి నుండి రూ.1747.50. లుగా ఉంది. ముంబైలో రూ. 1699, కోల్‌కతా రూ.1851.50, చెన్నైలో రూ. 1906లుగా ఉంది.
అయితే, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేదు.. గత నెలలో, దేశీయ వంట గ్యాస్ లేదా ఎల్పీజీ గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయి. వాణిజ్య రంగానికి ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించే నిర్ణయం. గృహ వినియోగదారుల కోసం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, గత నెల పెంపు ప్రభావం కొనసాగుతోంది. గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరించాయి.ఈ ధరలు 2025 మే 1 నుండి అమలులోకి వచ్చాయి. ప్రాంతాలవారీగా ధరలు మారుతాయి.
Read Also: Sundar Pichai: సుందర్ పిచాయ్ సక్సెస్ కు భార్య అంజలినే కారణమా!