పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్లాసిక్ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వర్షం’ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాను మే 23న 4K వెర్షన్‌లో తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్‌కు స్టార్ డమ్ వచ్చింది. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం అని చెప్పొచ్చు.
ప్రభాస్-త్రిషల మధ్య కెమిస్ట్రీ హైలైట్
ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్-త్రిషల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. గోపీచంద్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించాడు. ఆయన పోషించిన అగ్రెసివ్ విలన్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. సినిమా మొత్తం ప్రేమ, కుటుంబ విలువలు, వినోదం మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Read Also : Actress: కాస్టింగ్ కౌచ్‌పై రీతూ చౌదరి సంచలన కామెంట్స్
దేవి శ్రీ సాంగ్స్ సూపర్ హిట్
ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ ఆల్బమ్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ మూవీ లోని సాంగ్స్ ఇప్పటికీ అభిమానుల హృదయాలను తాకుతూనే ఉంటాయి. ఇప్పుడు 4K లో ఈ సినిమాను మళ్లీ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.