తమిళనాడులోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో చిరుతపులి సంచరించి అందరినీ బయాందోనళకు గురిచేసింది. ఊటీ సమీపంలోని ఈ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో చిరుత పులి ప్రవేశించింది. రాత్రి ప్రధాన ద్వారం ద్వారా పోలీస్ స్టేషన్ లోకి చొరబడిన చిరుత పులి, ఆస్టేషన్ లోని గదుల్లో తిరుగుతూ ఒక కొంత సమయం గడిపింది. లోపల ఎవరూ కనిపించకపోవడంతో కాసేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయింది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో, ఓ కానిస్టేబుల్ చిరుతను గమనించి భయంతో తలుపులు మూసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. కాసేపటికి చిరుత వెళ్లిపోవడంతో వెంటనే తలుపులు మూసివేయడం వీడియోలో కనిపించింది. . ఈ ఘటన స్థానికంగా తీవ్రమైన ఆందోళనకు దారి తీసింది. నడువట్టం ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కువైపోతున్న నేపథ్యంలో, స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనే విషయం వారు ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం పెరిగినట్లు చెప్పారు.
ఆటవీ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
స్థానికులు, అటవీ శాఖ ప్రాధికారులకు విజ్ఞప్తి చేస్తూ, వెంటనే ఈ చిరుత పులి లేదా మరిన్ని చిరుతల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. పులి సంచారం ఈ ప్రాంతంలో ప్రజల భద్రతకు ప్రమాదాన్ని ఏర్పరుస్తున్నందున, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
Read also: Supreme Court : పెగాసస్ నివేదికపై సుప్రీం కీలక వ్యాఖ్య