हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Ganesh Sharma: 71వ పీఠాధిపతిగా ఎంపికైన గణేశ్ శర్మ

Sharanya
Ganesh Sharma: 71వ పీఠాధిపతిగా ఎంపికైన గణేశ్ శర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంకు చెందిన యువ రుగ్వేద పండితుడు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ్ శర్మ తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఆయన్ను నియమిస్తూ శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది.

ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్న శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి తనకు సర్వశాస్త్రవేత్తగా మరియు సంపూర్ణ బ్రహ్మచారి ధర్మాన్ని కలిగి ఉన్న వారిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనేక మంది విద్యావంతులను పరిశీలించిన అనంతరం గణేశ్ శర్మను ఎంపిక చేసినట్టు సంస్థాన ప్రతినిధి చల్లా విశ్వనాథశాస్త్రి వెల్లడించారు. విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న కాంచీపురం కామాక్షి ఆలయంలో ఆయనకు సన్యాస దీక్షను ప్రసాదిస్తారని విశ్వనాధశాస్త్రి పేర్కొన్నారు.

గణేశ్ శర్మ పరిచయం

అన్నవరంకు చెందిన దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు. 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించిన గణేశ్ శర్మ ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు.

కంచి పీఠంలో శాస్త్రాభ్యాసం

గణేశ్ శర్మ, గత కొన్ని సంవత్సరాలుగా కాంచీపురంలోని కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ప్రాచీన వేద, శాస్త్ర విద్యలు అభ్యసిస్తూ తన జ్ఞానాన్ని మరింత మెరిపించారు. ఆయన నైపుణ్యం, ధార్మిక ప్రవర్తన, వినయశీలతతో పీఠంలోని ప్రధానాధికారుల దృష్టిలో విశేష ప్రాశస్త్యాన్ని పొందారు. యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించిన ఘనాపాటి గణేశ్ శర్మ కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. ఈ నెల 30న తిరుప్పతి సమీపంలోని కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో విజయేంద్ర సరస్వతి స్వామి ప్రత్యక్ష సమక్షంలో గణేశ్ శర్మకు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం గణేశ్ శర్మ అధికారికంగా 71వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గణేశ్ శర్మ ఈ గౌరవానికి ఎంపికవడం అన్నవరం క్షేత్రంలో అపూర్వమైన ఆనందాన్ని నింపింది. అక్కడి వ్రత పురోహితులు, అర్చకులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Butta Renuka: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870