‘తండేల్’ విజయంతో మంచి ఊపుమీదున్న నాగ చైతన్య, తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ఈసారి ఆయన ఓ భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. కథాంశం విషయానికొస్తే.. ఇది ట్రెజర్ హంటింగ్ నేపథ్యంతో కూడిన మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని చైతన్య ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కథలో పౌరాణికత, థ్రిల్, అన్వేషణ
ఈ సినిమా తాను కెరీర్‌లో చేసిన సినిమాలలోనే అత్యంత భారీ చిత్రమని నాగ చైతన్య పేర్కొన్నారు. కథలో పౌరాణికత, థ్రిల్, అన్వేషణ ఇలా అన్నింటినీ మిళితం చేస్తూ ప్రేక్షకులను కొత్త అనుభూతికి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇందులో చైతన్య పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా, ఇంటెన్స్ షేడ్స్‌తో ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
‘వృష కర్మ’ టైటిల్ ఫిక్స్ అవొచ్చా..?
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చైతన్య ‘వృష కర్మ’ అనే టైటిల్‌ను రివీల్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ఈ టైటిల్ పరిశీలిస్తే, అది పౌరాణిక నేపథ్యానికి తగ్గట్టుగానే కనిపిస్తోంది. అయితే మేకర్స్ ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్‌పై ఆసక్తిగా స్పందిస్తూ, ఇది చైతన్యకు మరో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందంటూ భావిస్తున్నారు.