Indian Army: పుల్వామా జిల్లా త్రాల్‌లోని ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని భారత సైన్యం పేల్చేసింది. పహల్గాం ఉగ్రదాడిలో ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే పుల్వామా జిల్లా త్రాల్‌లోని ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని భారత సైన్యం పేల్చేసింది. పెహల్‌గామ్ మారణహోమంలో జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన థోకర్ కీలక నిందితులలో ఒకరు కాగా, ఆషిఫ్ షేక్ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బిజ్‌బెహరా, త్రాల్ ప్రాంతాల్లోనూ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. లోకల్ ఉగ్రవాదుల నివాసాలపై దాడి చేస్తున్నాయి.
ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి రూ.20 లక్షలు
మరోవైపు ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ పోలీసులు గురువారం ప్రకటించారు. ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఇక అటు సింధూ జలాల నిలిపివేతపై పాక్‌కు భారత్ లేఖ రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. ఈ మేరకు లేఖ ద్వారా పాక్ అధికారి సయీద్ అలీ ముర్తుజాకు వివరించారు భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.
ఆదిల్ థోకర్ అనే మరో ఉగ్రవాదికి కూడా వీరితో సంబంధం
కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదలచేసిన విషయం తెలిసిందే. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్‌నేమ్‌లు కూడా ఉన్నట్లు పీటీఐ పేర్కొంది. ఆదిల్ థోకర్ అనే మరో ఉగ్రవాదికి కూడా వీరితో సంబంధం ఉందని తెలిపింది. వీరందరూ జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఊహా చిత్రాలను గీశారు. టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి వారి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో బాధితులు వారి ముఖాలను చూశారు. ఈ ఫొటోల ఆధారంగా వీరి కోసం భద్రతా సిబ్బంది వేట మొదలుపెట్టారు.
Read Also: నేడు ఉగ్రదాడి ఘటన వద్దకు రాహుల్ గాంధీ