Fawad Khan: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడిని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. సినీ ప్రముఖులు సైతం ఇది క్రూరమైన చర్య అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అటు.. పాకిస్థాన్ నటులు, వారు నటించిన సినిమాలు సైతం బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

‘అబీర్ గులాల్’ను భారత్‌లో బ్యాన్
ఈ క్రమంలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘అబీర్ గులాల్’ను భారత్ బ్యాన్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే వ్యతిరేకత మొదలైంది. పుల్వామా దాడి తర్వాత పాక్ నటులు ఇండియన్ సినిమాల్లో నటించడం మానేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత పాక్ నటుడు ఫవాద్ ఈ మూవీలో నటించారు. అయితే, తాజాగా పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ మూవీపై నిషేధం విధించారు.
వాణీ కపూర్‌పై విమర్శలు
మరోవైపు, యూట్యూబ్ (ఇండియా)లో ఈ సినిమా పాటలను తొలగించారు. ఈ విషయంపై మేకర్స్ స్పందించలేదు. ఉగ్రదాడిపై స్పందించకుండా.. అదే రోజు సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్ చేశారంటూ వాణీ కపూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ నటులను ప్రోత్సహిస్తున్నారంటూ బాలీవుడ్ పైనా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో ఆర్తి ఎస్. బగ్దీ ‘అబీర్ గులాల్’ను తెరకెక్కించారు.
Read Also: అనుకున్నది సాధించానని వెల్లడి : చంద్ర